దేశంలోనే తొలిసారి దళితుడికి జగద్గురు బిరుదు

దేశంలోనే తొలిసారి దళితుడికి జగద్గురు బిరుదు

Phani CH

|

Updated on: May 02, 2024 | 10:05 PM

దేశ చరిత్రలోనే తొలిసారి ఓ దళితుడికి జగద్గురు బిరుదు లభించింది. మహామండలేశ్వర్ మహేంద్రానందగిరి ఈ బిరుదు అందుకున్నారు. దేశంలోని 13 అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా మంగళవారం ఆయనకు ఈ బిరుదును అందించింది. మహేంద్రానందగిరి శిష్యులు కైలాశానాందగిరి, రాంగిరికి వరుసగా మహామండలేశ్వర్, శ్రీమహంత్ బిరుదులను ప్రదానం చేసింది. వీరందరూ షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే.

దేశ చరిత్రలోనే తొలిసారి ఓ దళితుడికి జగద్గురు బిరుదు లభించింది. మహామండలేశ్వర్ మహేంద్రానందగిరి ఈ బిరుదు అందుకున్నారు. దేశంలోని 13 అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా మంగళవారం ఆయనకు ఈ బిరుదును అందించింది. మహేంద్రానందగిరి శిష్యులు కైలాశానాందగిరి, రాంగిరికి వరుసగా మహామండలేశ్వర్, శ్రీమహంత్ బిరుదులను ప్రదానం చేసింది. వీరందరూ షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే. ప్రయాగ్‌రాజ్‌ జునా అఖాడాలోని సిద్దబాబా మౌజిగిరి ఆశ్రమంలో వేదమంత్రాల సాక్షిగా వీరు ఈ బిరుదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేంద్రానంద, కైలాశానందను సింహాసనంపై కూర్చోబెట్టి వారి హోదాలు తెలిపే ఛత్రాలు అందించారు. ఈ సందర్భంగా కాశీ సుమేరు పీఠాధీశ్వర్ జగద్గురు స్వామి నరేంద్రానంద సరస్వతి స్పందిస్తూ.. జునా అఖాడా నిర్ణయం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. శ్రీరాముడు చూపిన సామాజిక సామరస్యం బాటలో జునా అఖాడా నడుస్తోందని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిపై దాడి

ఆహా.. ఇది కదా సంస్కారమంటే.. కట్టిపడేస్తున్న చిన్నారి వీడియో

ప్రేయసితో కలిసి లాడ్జ్‌లో స్టే చేసిన యువకుడు.. బాత్‌రూమ్‌లో ??

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర