హత్రాస్ కుటుంబాన్ని కలిసిన యూపీ పోలీసు ఉన్నతాధికారులు
యూపీ పోలీసు ఉన్నతధికారులు శనివారం హత్రాస్ లో బాధిత యువతి కుటుంబాన్ని కలిశారు. డీజీపీ హెచ్.సీ.అవస్థి, హోం కార్యదర్శి అవనీష్ అవస్థి, ఇతర ఉన్నతాధికారులు తమ బృందంతో..

యూపీ పోలీసు ఉన్నతాధికారులు శనివారం హత్రాస్ లో బాధిత యువతి కుటుంబాన్ని కలిశారు. డీజీపీ హెచ్.సీ.అవస్థి, హోం కార్యదర్శి అవనీష్ అవస్థి, ఇతర ఉన్నతాధికారులు తమ బృందంతో ఈ ఫ్యామిలీని కలిసి వారిని అనునయించడానికి ప్రయత్నించారు. వీరు నేలపైనే కూర్చుని, చేతులు జోడించి తమ దర్యాప్తులో ఎలాంటి లోపం లేదని చెప్పడానికి నానా పాట్లూ పడ్డారు. మీడియా రిపోర్టర్లంతా చుట్టుముట్టి ఉండగా వారు బేలగా కనిపించారు. హత్రాస్ ఘటనను సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు యూపీ పోలీసు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేస్తూ… ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఎస్పీ తో సహా అయిదుగురు పోలీసులను యూపీ ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసింది.



