AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా?’

‘మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా? ఇదేనా మీ పద్దతి అంటూ విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ‘సబ్బంహరి పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మరీ అవాకులు, చవాకులు పేలుతున్నారంటూ మాజీ ఎంపీ సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత […]

'మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా?'
Venkata Narayana
|

Updated on: Oct 03, 2020 | 5:57 PM

Share

‘మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా? ఇదేనా మీ పద్దతి అంటూ విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ‘సబ్బంహరి పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మరీ అవాకులు, చవాకులు పేలుతున్నారంటూ మాజీ ఎంపీ సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో సబ్బం వీధి రౌడీలా మాట్లాడారని మండిపడ్డారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సిబ్బందిపై సబ్బం హరి దుర్భాషలాడారని అన్నారు.

ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం సరికాదని మంత్రి అవంతి హితవు పలికారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. సబ్బం హరి తీరుపై ఎమ్మెల్యే అదీప్‌రాజు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని చెప్పారు.

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ