మిస్టరీ వీడిన జయరాం హత్యకేసు

ఇక జయరాం హత్యకేసులో రాకేష్, శ్రీనివాస్ కస్టడీ నేటితో ముగుస్తుంది. గురువారం శిఖాచౌదరి, కమెడీయన్ సూర్య, కోస్టల్ బ్యాంక్ ఎండీ ప్రసాద్ తో పాటు మరో 8 మందిని ప్రశ్నించిన పోలీసులు.. నేడు మరికొంతమందిని ప్రశ్నించనున్నారు. టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్న రియల్టర్లు, రౌడీషీటర్లను రాకేష్ రెడ్డి సమక్షంలో విచారిస్తారు పోలీసులు. అలాగే సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ ను ఇవాళ నందిగామకు తీసుకెళ్లనున్నారు. జయరాం హత్యకేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. […]

మిస్టరీ వీడిన జయరాం హత్యకేసు

ఇక జయరాం హత్యకేసులో రాకేష్, శ్రీనివాస్ కస్టడీ నేటితో ముగుస్తుంది. గురువారం శిఖాచౌదరి, కమెడీయన్ సూర్య, కోస్టల్ బ్యాంక్ ఎండీ ప్రసాద్ తో పాటు మరో 8 మందిని ప్రశ్నించిన పోలీసులు.. నేడు మరికొంతమందిని ప్రశ్నించనున్నారు. టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్న రియల్టర్లు, రౌడీషీటర్లను రాకేష్ రెడ్డి సమక్షంలో విచారిస్తారు పోలీసులు. అలాగే సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ ను ఇవాళ నందిగామకు తీసుకెళ్లనున్నారు.

జయరాం హత్యకేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో అన్ని విషయాలు పూస గుచ్చినట్లు విచారించాడు రాకేష్ రెడ్డి. జయరాం హత్యకు వారం రోజుల ముందే స్కెచ్ గీసినట్లు చెప్పాడు. అలాగే తాను హత్య చేస్తున్నట్లు రౌడీషీటర్ నగేష్, విశాల్, శ్రీనివాస్ లకు ముందే చెప్పాడు. దస్పల్లా హోటల్ నుంచి వీణా మేడం డ్రైవర్ నంటూ కమెడీయన్ సూర్య జయరాంను కారులో ఎక్కించుకొచ్చాడని వివరించాడు. హత్య చేసేటప్పుడు సీన్ లో నలుగురు ఉన్నారు. ఆ తర్వాత డెడ్ బాడీతో నల్లకుంట పీఎస్ కు వెళ్లామని.. సీఐ శ్రీనివాస్ తో మాట్లాడినట్లు చెప్పాడు రాకేష్.

జయరాంను బెదిరించి వంద రూపాయల బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నానని.. అతను చచ్చిపోతే ఆస్తులన్నీ తనకు దక్కుతాయని హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపాడు. సీఐతో మాట్లాడాక యాక్సిడెంట్ గా క్రియేట్ చేసేందుకు నందిగామ వెళ్లి కారును అక్కడ వదిలేసినట్లు చెప్పాడు రాకేష్. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగుర్ని నిందితులుగా చేర్చనున్నారు హైదరాబాద్ పోలీసులు. రేపు మీడియా ముందుకు హత్యకేసు వివరాల్ని ప్రకటించే అవకాశం ఉంది.