Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. గెలిచిన మెహబూబ్

బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో లగ్జరీ టాస్క్‌లో భాగంగా  స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్న రియల్ మ్యాంగో బాటిల్స్‌ని తెచ్చి దించకుండా తాగాలని బిగ్‌బాస్‌ వెల్లడించారు.

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. గెలిచిన మెహబూబ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 16, 2020 | 9:57 AM

Bigg Boss 4 Luxury task: బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో లగ్జరీ టాస్క్‌లో భాగంగా  స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్న రియల్ మ్యాంగో బాటిల్స్‌ని తెచ్చి దించకుండా తాగాలని బిగ్‌బాస్‌ వెల్లడించారు. ఎవరు ఎక్కువ బాటిల్స్ తాగితే వాళ్లే విజేతలని తెలిపారు. ఇక ఈ ఆటలో కుమార్ సాయి-మెహబూబ్‌లు పోటీ పడ్డారు. బజర్ మోగేసరికి మెహబూబ్ ఏడు బాటిల్స్.. కుమార్ సాయి ఆరు బాటిల్స్ తాగారు. దీంతో మెహబూబ్ విజేత‌గా నిలిచాడు.

ఇక లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా మటన్, చికెన్, కాఫీ, గ్రీన్ టీలు హౌజ్‌లోకి వచ‌్చాయి. దీంతో వరద బాధితులకు పులిహోర పాకెట్లు లభించినట్టుగా కంటెస్టెంట్‌లు తెగ సంతోషపడ్డారు. చికెన్, మటన్ అంటూ ఆనందించారు. దివి ఎట్టకేలకు ఊడ్చుతుంటే అవినాష్, లాస్యలు గుసగుసలాడుతూ ఆమెపై కెప్టెన్ నోయల్‌కి కంప్టైంట్ ఇచ్చారు. మరోవైపు ఇంటి సభ్యులు స్ట్రెస్ రిలీఫ్ కోసం జెర్సీలో నాని అరిచినట్లు పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేశారు. వాళ్ల పిచ్చిని చూసి స్టేజ్ 5 బ్రదర్ అని అభిజిత్‌ కామెంట్లు చేశారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే

Bigg Boss 4: సొహైల్ vs అరియానా.. ఊహించని ట్విస్ట్