Bigg Boss 4: సొహైల్ vs అరియానా.. ఊహించని ట్విస్ట్

బిగ్‌బాస్ 4 హౌజ్‌లో షార్ట్‌ టెంపర్‌తో అర్జున్‌ రెడ్డిని తలపిస్తోన్న సొహైల్‌ ఇప్పుడు కాస్త మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున హెచ‌్చరిక

Bigg Boss 4: సొహైల్ vs అరియానా.. ఊహించని ట్విస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 16, 2020 | 10:50 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ 4 హౌజ్‌లో షార్ట్‌ టెంపర్‌తో అర్జున్‌ రెడ్డిని తలపిస్తోన్న సొహైల్‌ ఇప్పుడు కాస్త మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున హెచ‌్చరిక, బిగ్‌బాస్‌కి ఇచ్చిన మాట ప్రకారం ఈ వారం మొదటి నుంచి కోపం వచ్చిన ప్రతిసారి చాాలా కంట్రోల్‌ చేసుకుంటూ వస్తున‌్నాడు సొహైల్‌. ఇదిలా ఉంటే హౌజ్‌లోకి వెళ్లకముందు సొహైల్‌, అరియానా మంచి స్నేహితులు కాగా.. హౌజ్‌లోకి వెళ్లిన తరువాత వీరిద్దరి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమన్నట్లు తయారైంది. కానీ గురువారం నాటి ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ జరిగింది. సొహైల్‌, అరియానా దగ్గరకు వెళ్లి ఆమెకు న్యూడిల్స్ తినిపించాడు. తన వలన హర్ట్‌ అయితే సారీ అని అరియానాకు చెప్పాడు.

ఇక ఆ తరువాత అరియానా, అవినాష్‌ దగ‌్గరకు వెళ్లి.. సొహైల్ నాకు సారీ చెప్పాడు, తినిపించాడు అంటూ తెగ మెలికలు తిరిగింది. ఇక అవినాష్ కూడా అరియానాకు తినిపించాలని చూశాడు. ఆమె తినకపోవడంతో సొహైల్ తినిపిస్తే తింటావు.. నేను తినిపిస్తే తినవా? అని అడిగాడు. ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. నాకు ఏదో అవుతుందని అరియానా గట్టిగా అరుస్తూ పిచ్చి చేష్టలు చేసింది.

Read More:

ఖమ్మం అత్యాచార ఘటన.. మైనర్ బాలిక మృతి

Bigg Boss 4: ఓల్డ్‌ మెమోరీస్‌.. ఏడుస్తూ ఏడ్పించిన కంటెస్టెంట్లు