Bigg Boss 4: ఓల్డ్‌ మెమోరీస్‌.. ఏడుస్తూ ఏడ్పించిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌ 4 గురువారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు స్వీట్‌ మెమోరీస్‌ని చూపించారు. వారి చిన్నప్పటి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలను చూపించారు

Bigg Boss 4: ఓల్డ్‌ మెమోరీస్‌.. ఏడుస్తూ ఏడ్పించిన కంటెస్టెంట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 16, 2020 | 7:21 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ 4 గురువారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు స్వీట్‌ మెమోరీస్‌ని చూపించారు. వారి చిన్నప్పటి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలను చూపించారు. దీంతో తమ స్టోరీలను చెబుతూ కొంతమంది కంటెస్టెంట్‌లు కుళాయి విప్పేశారు. మొదటగా అరియానా.. తన అసలు పేరు అర్చన అని, తమ తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో మగ దిక్కులేని సంసారాన్ని తన తల్లి అతి కష్టం మీద నెట్టుకొచ్చిందని చెప్పింది. ఆ తరువాత మోనాల్.. తన ఫ్యామిలీని చాలా ఇష్టపడతానని చెప్పింది. అనంతరం సొహైల్.. తన తండ్రి సింగరేణి బొగ్గు గనిలో పని చేస్తాడని, ఆయన అతి కష్టం మీద తమ ఐదుగురు సోదరులను పెంచారని చెప్పాడు.

ఇకమెహబూబ్.. ”గుంటూరులో మాది కూరగాయల షాప్. చాలా పేద కుటుంబం కుటుంబం గడవడం కోసం నా తమ్ముడు కూరగాయల మార్కెట్‌లో పని చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. నా తల్లిదండ్రులు, తమ్ముడు నన్ను ఇంజినీరింగ్ పూర్తి చేయించారు. ఆ ముగ్గురి వల్లే తాను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత లాస్య.. ”నా తండ్రి రైతు. మా అమ్మ నిండు  గర్భిణిగా ఉన్నప్పుడు గడ్డి కోసేందుకు వెళితే అప్పుడే పురిటి నొప్పులు వచ్చాయి. ఓ వైపు రక్తం కారుతున్నా అమ్మ‌ కిలో మీట‌రు న‌డిచి ఇంటికి చేరుకుని మంచంపై ప‌డుకుంది. కాసేపటికే డెలివరీ అయి నేను పుట్టాను. అయితే నాన్న‌కు న‌చ్చ‌ని పెళ్లి చేసినందుకు నాత మూడేళ్లు మాట్లాడ‌లేదు. అయితే ఆయ‌న‌కు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు మొద‌టిసారి అప్పు చేశా. అంద‌రి ద‌గ్గ‌రా అడిగి ల‌క్షా 50 వేలు తీసుకున్నా. నాన్నకు మూడు ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు జ‌రిగాయి. ఆ సమయలో నాకు ద‌గ్గ‌రివాళ్లు కూడా సాయం చేయ‌లేదు. కానీ నా భ‌ర్త ముందుకు వ‌చ్చి నిల‌బ‌డ్డాడు.‌ అప్ప‌టి నుంచి మా నాన్న మా ఆయ‌నను కొడుకు అని పిలుస్తాడు. మా నాన్న‌ను జీవితంలో ఇంకెప్పుడూ బాధ‌పెట్ట‌ను” అని చెప్పుకొచ్చింది.

ఇక అమ్మ రాజశేఖర్.. తన తల్లి అంటే తనకు ఇష్టమని అందుకే ప్రతిదానికి అమ్మ పేరు పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. తన తల్లి అనారోగ్యంతో మరణించారని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్.. డబ్బు ముఖ్యం కాదు. మనుషులే ముఖ్యం అంటూ ఓ అద్భుతమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. తరువాత నోయెల్.. ”నా తల్లి బలవంతం మీద మేము పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చాము. మా అమ్మ ఇళ్లలో పనులు చేసేది. నాన్న రిక్షా తోలేవాడని చెప్పాడు. మా నాన్న చిరంజీవి ఫ్యాన్. ఆయన కారణంగానే సినిమాల్లోకి వచ్చానని చెప్పాడు.

ఆ తరువాత హారిక.. నా లైఫ్‌లో ఏం జరిగినా ఇంటర్ లైఫ్‌ని గుర్తు పెట్టుకుంటా. ఒకసారి మా అమ్మ కాల్ చేసి అమ్మమ్మ ఇంటికి రమ్మని చెప్పింది. వెళితే నేను, డాడి సెపరేట్ అవుతున్నాము. కొద్దిరోజులు డాడీతో ఉండండి అని నాకు, అన్నయ్యకు చెప్పింది. కొద్ది రోజులకు మళ్లీ అన్నయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్లిపోవాల్సి వచ్చింది.  ఓ సారైతే మా నాన్న పేరు కూడా గుర్తు రాదు. నాన్న..‌ మేమెప్పుడూ తిరిగి చూడ‌లేదు, మీరెప్పుడు తిరిగి చూడ‌లేదు. ఒకవేళ తిరిగి చూసిన ‌రోజు మేం ఆగిపోతాం అని తెలుసు. అందుకు తిరగలేదు. కానీ ఎప్ప‌టికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. అమ్మా.. నువ్వు లేని రోజు నేను లేను, నాన్న లేని లోటు అన్న తీర్చాడు, మా అన్న నా వెన్నెముక” అని చెప్పింది. అయితే అఖిల్, అభిజిత్‌, దివిల గురించి మాత్రం చూపించలేదు.

Read More:

తమిళనాడులో కరోనా కేసులు ఇలా ఉన్నాయి

భారీ వర్షాలతో కృష్ణమ్మ మహోగ్రరూపం