వాళ్లే ‘బిట్టూ’ అని పిలవమన్నారు.. బాధ కలిగిస్తే క్షమించండి.!
సుజాత.. నాగార్జునను 'బిట్టూ' అని పిలవడం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ''బిగ్ బాస్ టీం మొదటిగా నన్ను నాగార్జున అంటే ఇష్టమా అని అడిగారు. దానికి అవునని చెప్పాను.
ఎప్పటిలానే ఈ బిగ్ బాస్ సీజన్‌లో కూడా ప్రతీ వారం ఎలిమినేషన్ ఎవరవుతారన్నది ప్రేక్షకులు ముందుగానే ఊహించగలిగారు. ఒక్క దేవి నాగవల్లి ఎలిమినేషన్ తప్ప.! ఇక ఐదో వారం బిగ్ బాస్(Bigg Boss 4) హౌస్ నుంచి జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె టాస్కులలో బాగానే ఆడింది. కానీ ఆమె నవ్వు ఫేక్ అని చాలామంది అన్నారు. అంతేకాదు నాగార్జునను పట్టుకుని ‘బిట్టూ’ అని పిలవడం ఆయన అభిమానులకు అసలు నచ్చలేదు. ఈ రీజన్స్ వల్లే సుజాత ఎలిమినేట్ అయిందని పలువురు ప్రేక్షకులు కూడా అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే సుజాత.. నాగార్జునను ‘బిట్టూ’ అని పిలవడం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ”బిగ్ బాస్ టీం మొదటిగా నన్ను నాగార్జున అంటే ఇష్టమా అని అడిగారు. దానికి అవునని చెప్పాను. అంతేకాకుండా ఆయన ‘మనం’ సినిమాలో చేసిన బిట్టూ క్యారెక్టర్ చాలా ఇష్టమని అన్నాను. మరి ఆయన్ని ‘బిట్టూ’ అని పిలవడం నీకు ఇష్టమేనా అని అడిగారు. సరేనన్నాను. ‘బిట్టూ’ అని పిలుస్తుంటే నాగార్జున సర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ‘బిట్టూ’ అని పిలవడం నాగార్జున గారికి గానీ, బిగ్ బాస్ టీంకు గానీ నచ్చకపోతే.. నన్ను వెంటనే కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి వద్దనేవారు. కానీ అలా జరగలేదు. అయితే నాగ్ సర్‌ను ‘బిట్టూ’ అని పిలవడం ఆయన అభిమానులకు బాధ కలిగిస్తే క్షమించండి” అని సుజాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Also Read:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!
ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!
బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?