Breaking News
  • తెలంగాణలో వర్షాలను కేంద్రం గమనిస్తోంది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయి. వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం. కేంద్ర బృందంలో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు. వరద బాధితులకు కేంద్ర సాయం అందుతుంది. వైపరీత్యాల వల్ల చనిపోయినవారికి.. రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని మోదీ గతంలోనే నిర్ణయించారు. కేంద్ర సాయం అందేలోపు ఎస్డీఆర్‌ఎఫ్‌ నుంచి ఖర్చు చేయాలి. తర్వాత కేంద్రం రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది-కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.
  • అమరావతి: ఉపాధి హామీ కూలీలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, ఉపాధి కూలీలకు మంత్రి ధర్మాన క్షమాపణ చెప్పాలి-టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • నేటి నుంచి ఈ నెల 31 వరకు కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌తో నేడు అవగాహన ర్యాలీ. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ భౌతిక దరం పాటించాలి, మాస్క్‌ ధరించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని.
  • దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్. కర్నాటక లోకాయుక్తను ఆశ్రయించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై ఫిర్యాదు. బీఎస్‌-3 వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్‌ చేయించిన యాజమాన్యం. 33 బస్సులు, లారీలను కర్నాటకలో నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్. లోకాయుక్తకు ఆధారాలు సమర్పించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కర్నాటక రవాణాశాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు.

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?

Bigg Boss 4, బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?

Bigg Boss 4: బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. మొన్నటివరకు అభిజిత్-మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ నడిచింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టాస్కుల పుణ్యమా అని మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కొత్త ముఖాలే. మొదటి రెండు వారాలు సోసోగానే ఉన్నా.. తర్వాత ఒక్కొక్కరి టాలెంట్ బయటపడుతోంది. ఫ్యాన్స్‌కు ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సినంత దొరుకుతోంది.

మరోవైపు ఈ బిగ్ బాస్‌ సీజన్‌లో కంటెస్టెంట్ల ఆటతీరును బట్టి టాప్ ఫైవ్‌లో ఎవరుంటారన్నది ప్రేక్షకులు ఇప్పుడే చెప్పేస్తున్నారు. నిజానికి టాప్ 5 గురించి ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా, ఆట పరంగా చూసుకుని ఆడియన్స్ అప్పుడే మార్కులు వేసేస్తున్నారు.

మరి ఆ లిస్టులో టాప్ కంటెస్టెంట్‌గా అభిజిత్ ఉంటాడని అభిమానులు అనుకుంటున్నారు. ఏ విషయాన్ని అయినా కూల్‌గా సాల్వ్ చేయడం.. తను తప్పు చేసినా.. తాను తప్పు చేసినట్లు వేరే కంటెస్టెంట్లు చెప్పినా.. వెంటనే సారీ చెబుతున్నాడని అంటున్నారు. హౌస్‌మేట్స్ అందరితోనూ కలవాలని ప్రయత్నిస్తున్నాడని… ఇవే అభిజిత్‌ను టాప్ 5లో నిలబెడతాయని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్‌లో ఎంటరైన అవినాష్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. తనదైన శైలి కామెడీతో హౌస్‌లో నవ్వులు పూయిస్తున్నాడు. ఇక ఈ మధ్య అరియనా-అవినాష్‌ల కాంబినేషన్‌లో వచ్చే ఎపిసోడ్స్ ఎంటర్టైన్మెంట్ పీక్స్ అని చెప్పాలి. అలాగే గొడవలకు వెళ్లకుండా సరదాగా ఉంటూ అందరిని నవ్విస్తున్న అవినాష్ టాప్ ఫైవ్‌లో ఉంటాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

అలాగే సోహైల్, అఖిల్ కూడా టాస్క్ ఇవ్వాలే కానీ ప్రతీసారి తమ సత్తాను చూపిస్తున్నారు. ఆయా టాస్కుల్లో 100 శాతం ఎఫర్ట్ పెట్టి తమ స్క్రీన్ ప్రజెన్స్‌ను పెంచుకుంటున్నారు. అటు అరియనా కూడా ప్రతీ టాస్క్‌లో అదరగొడుతోంది. ఇదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా టాప్ ఫైవ్‌లో వీరి ముగ్గురు ఉంటారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక లాస్య కూడా బిగ్ బాస్ టాప్ ఫైవ్‌లో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆమెకు బయట ఫుల్ సపోర్ట్ ఉండటం.. ఒక ప్లస్.. కానీ లాస్య ఒక్కోసారి డల్ అవుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న లాస్య టాప్ ఫైవ్‌కు వెళ్తుందనే అభిమానులు భావిస్తున్నారు. దివి కూడా అదరగొడుతోంది కానీ.. మ్యానిపులేట్ అవుతోందని.. మరి మున్ముందు ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి.. ఈ క్రమంలోనే పరిణామాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సమయానికి వీరే ఉంటారా.? లేక వేరే కొత్తవాళ్లు యాడ్ అవుతారా.? అనేది వేచి చూడాలి.

Related Tags