Bigg Boss 4: ఊహించని షాక్‌.. ఎలిమినేట్ అయిన దేవి

బిగ్‌బాస్‌ 4 మూడో వారంలో మరొకరు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ సారి ఎలాగైనా బిగ్‌బాస్‌ టైటిల్‌ని గెలవాలన్న

Bigg Boss 4: ఊహించని షాక్‌.. ఎలిమినేట్ అయిన దేవి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 28, 2020 | 7:33 AM

Devi eliminated Bigg Boss 4: బిగ్‌బాస్‌ 4 మూడో వారంలో మరొకరు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ సారి ఎలాగైనా బిగ్‌బాస్‌ టైటిల్‌ని గెలవాలన్న ధ్యేయంతో హౌజ్‌లోకి అడుగుపెట్టిన దేవి నాగవల్లి ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో అటు హౌజ్‌లోని కంటెస్టెంట్‌లతో పాటు ఇటు వీక్షకులు షాక్‌కి గురయ్యారు. రెండో వారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యే వెళ్లే సమయంలో బిగ్‌బాంబ్‌ని దేవిపై వేసింది. దీంతో ఆమె ఎలిమినేషన్‌లోకి  వచ్చింది. ఇక గత వారం టాస్క్‌లలో దేవి బాగానే ఆడింది. అయినప్పటికీ చివరకు ఎలిమినేట్ అవ్వడం చాలా మందిని షాక్‌కి గురి చేసింది.

ఇక దేవి ఎలిమినేట్ అయ్యారంటూ నాగ్ చెప్పగానే అరియానా బోరున ఏడ్చేసింది. ‘నేను ఎలిమినేట్ అయినా ఇంత బాధపడేదాన్ని కాదక్కా’ అని దేవిని పట్టుకొని ఏడ్చింది. ఇంటి సభ్యులు సైతం ‘ఏదో సర్ ప్రైజ్ ఉండి ఉంటుందిలే’ అని దేవికి ధైర్యం చెప్పారు. హౌజ్‌లోకి వెళ్లిన తరువాత దేవికి శత్రవుగా ఉన్న అమ్మ రాజ శేఖర్ మాస్టర్ సైతం ఆమెను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక గంగవ్వ కాళ్లు మొక్కి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు దేవి.

ఆమె స్టేజ్ మీదికి వచ్చిన తరువాత ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని నాగార్జున అడిగారు. అందుకు నాకు తెలీదు సర్ అంటూ దుఃఖాన్ని దిగమింగుకొని చెప్పారు. ఇక నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను కాని.. దేవిని ఎప్పుడూ ఇలా చూడలేదు అని నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు.

అయితే బయటికి వచ్చిన తరువాత హౌజ్‌లోని ప్రతి కంటెస్టెంట్‌ గురించి ఆమె పాజిటివ్‌గా చెప్పారు. దీంతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. చివరగా ‘నువ్వుంటే నా జతగా’ అంటూ ఎమోషనల్ సాంగ్ పాడి బయటకు వచ్చేశారు దేవి.

Read More:

ఐపీఎల్‌లో సంచలనం..భారీ టార్గెట్ ఛేదించిన రాజస్థాన్‌

RRvsKXIP: క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫీల్డింగ్, రోమాలు నిక్కబొడుచుకుంటాయి!