ఐపీఎల్‌లో సంచలనం..భారీ టార్గెట్ ఛేదించిన రాజస్థాన్‌

కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌  సూపర్ విక్టరీ నమోదు చేసింది. కింగ్స్‌ విసిరిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ అలవోకగా చేదించింది.

ఐపీఎల్‌లో సంచలనం..భారీ టార్గెట్ ఛేదించిన రాజస్థాన్‌
Follow us

|

Updated on: Sep 28, 2020 | 12:04 AM

కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌  సూపర్ విక్టరీ నమోదు చేసింది. కింగ్స్‌ విసిరిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ అలవోకగా చేదించింది. సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) లు అదిరిపోయే షాట్లతో ఆకట్టుకున్నారు. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(4) రాణించకపోయినా… స్టీవ్‌ స్మిత్‌, సంజూ శాంసన్‌లు 81 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 9 ఓవర్ల ముగిసే సరికి రాజస్థాన్‌ ‌ రాయల్స్‌ 100 పరుగుల మార్కును దాటడంతో బ్యాట్స్ మెన్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరివరకు రెండు జట్లు మ్యాచ్ పై పట్టు విడవలేదు. ఒకవైపు శాంసన్‌ భారీ షాట్లతో విరుచుకుపడుతుంటే, తెవాతియా నిలదొక్కకునేందుకు ఇబ్బంది పడ్డాడు. రాజస్థాన్ విజయానికి చివరి 18 బంతుల్లో 51 రన్స్ కావాల్సిన సమయంలో దశలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన కాట్రెల్ బౌలింగ్‌లో 5 సిక్సర్లు ( 6, 6, 6, 6, 0, 6)  బాదిన రాహుల్ తెవాతియా ఒక్క‌సారిగా మ్యాచ్‌ని మలుపుతిప్పాడు. చివర్లో ఆర్చర్‌ 3 బంతుల్లో 2 సిక్స్‌లు బాదడంతో రాజస్థాన్‌ ఇంకా మూడు బంతులు ఉండగానే విజయం సాధించింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కూడా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 223 ప‌రుగుల చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. ముఖ్యంగా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. మ‌యాంక్ అగ‌ర్వాల్ (106 ప‌రుగులు, 10 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) ఐపీఎల్ లో మొదటి సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్ (69 ప‌రుగులు, 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) మరోసారి రాణించాడు. ఇక ఇన్నింగ్స్ చివ‌ర్లో మాక్స్‌వెల్ (13 ప‌రుగులు, 2 ఫోర్లు), నికోలాస్ పూర‌న్ (25 ప‌రుగులు, 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు)లు మెరుపులు  మెరిపించారు. ఈ క్ర‌మంలో పంజాబ్ జ‌ట్టు రాజ‌స్థాన్ ఎదుట భారీ 224 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది. రాజస్థాన్‌ ఆ టార్గెట్ ఛేదించి విజయం సాధించింది.

Also Read :

RRvsKXIP: క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫీల్డింగ్, రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

ప్రభాస్ క్రేజీ రికార్డ్.. తొలి సౌత్ హీరోగా అరుదైన ఘనత

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..