Breaking News
  • అమరావతి : మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా . ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రి కి చేరుకున్న సీఎం జగన్. ఘాట్ రోడ్ మార్గంలో వచ్చిన సీఎం . సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,జిల్లా ప్రజా ప్రతినిధులు ,కలెక్టర్ ,సిపి [ సాంప్రదాయ వస్త్ర ధారణ పంచెకట్టు లో సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • చిత్తూరు: చిత్తూరులో భారీ ఎత్తునపట్టుబడిన ఎర్రచందనం. ఐదు కార్లలో రెండు కోట్ల విలువైన రెండున్నర టన్నుల ఎర్రచందనం పట్టి వేత. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం. 11మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో పదిమంది స్మగ్లర్ల పరారీ.. కార్లు, ఆటోలు, పాల వానలు లో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడటం ఇదే మొదటిసారి.

RRvsKXIP: క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫీల్డింగ్, రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. కింగ్స్ లెవన్ పంజాబ్ ఆటగాడు తన అద్బుతమైన  ఫీల్డింగ్ తో మ్యాజిక్  చేశాడు.

, RRvsKXIP:  క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫీల్డింగ్, రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. కింగ్స్ లెవన్ పంజాబ్ ఆటగాడు పూరన్  తన అద్బుతమైన  ఫీల్డింగ్ తో మ్యాజిక్  చేశాడు.  క్రికెట్ చరిత్రలోనే ఇది బెస్ట్ ఫీల్డింగ్ అని సీనియర్లు, మాజీలు ప్రశంశిస్తున్నారు.  రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మురుగన్ అశ్విన్ 8వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో రాజస్థాన్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. ఫస్ట్ బంతికి సింగల్ తీసి స్ట్రైకింగ్ సంజూ శాంసన్‌కు ఇచ్చాడు సారథి స్టీవ్ స్మిత్. అశ్విన్ వేసిన రెండో బంతిని భారీ షాట్ ఆడాడు సంజూ శాంసన్. అది పక్కా సిక్స్ అని అందరూ భావించారు. కానీ పంజాబ్ ఫీల్డర్ పూరన్ బౌండరీ లైన్ వద్ద మెరుపు తీగలా మారాడు.  ఆ భారీ షాట్‌ను బౌండరీ దాటిన తర్వాత గాల్లో అద్భుతంగా క్యాచ్ పట్టాడు. తన బాడీ నేలకు టచ్ అవ్వకముందే వెంటనే ఆ బంతిని మళ్లీ ఫీల్డ్‌లోకి విసిరేశాడు. వావ్…మీరూ ఆ క్యాచ్ చూడండి. వెంట్రకలు నిక్కబొడుచుకుంటాయ్. ఫీల్డింగ్ వీరుడిగా పేరుగాంచిన  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశాడు. ఆ బంతికి కేవలం రెండు రన్స్ మాత్రమే వచ్చాయి. ఓ భారీ సిక్స్‌ను పూరన్ సేవ్ చేసిన విధానం క్రికెట్ అభిమానులను తెగ ఇంప్రెస్ చేస్తోంది.

లెజెండ్ సచిన్  కూడా ఈ ఫీల్డింగ్ చూసి ఫిదా అయిపోయాడు. పూరన్ మెరుపు ఫీల్డింగ్ చూసిన వెంటనే  ట్వీట్ చేశాడు. ‘నా లైఫులో చూసిన అద్భుతమైన సేవ్. సింప్లీ అద్భుతం.’ అని పేర్కొన్నాడు. ఇక క్రికెట్ లవర్స్ పూరన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Related Tags