Bigg Boss 4: ఆసక్తికర సన్నివేశం.. అభికి అఖిల్‌కి సపోర్ట్
బిగ్‌బాస్ 4లో అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాగానే ఉన్నప్పటికీ.. రాను రాను అభిజిత్, అఖిల్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయి
Abhijeet Akhil Bigg Boss 4: బిగ్‌బాస్ 4లో అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాగానే ఉన్నప్పటికీ.. రాను రాను అభిజిత్, అఖిల్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మోనాల్ విషయంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతూనే ఉంది. మోనాల్‌ని ఈ ఇద్దరు లైక్ చేస్తుండటంతో తెలీకుండానే వీరి మధ్య గొడవకు కారణమైంది. ఇక మోనాల్ విషయంలోనే నామినేషన్ల సమయంలో వీరిద్దరు ఎలాంటి కారణాలు లేకుండానే ఒకరినొకరు నామినేట్ చేసుకునే వారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి.
మోనాల్‌కి అభి దూరంగా వచ్చేశాడు. కానీ అఖిల్ మాత్రం తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే అభిజిత్‌కి అఖిల్ సపోర్ట్‌ని ఇచ్చాడు. డైలాగుల విషయంలో స్క్రిప్ట్ రైటర్ అవినాష్‌కు, దర్శకుడు అభిజిత్‌కి బేధాభిప్రాయాలు వచ్చాయి. ఆ సమయంలో అవినాష్ విసుగు చూపించాడు. అయితే అనూహ్యంగా ఈ విషయంలో అఖిల్, అభికి సపోర్ట్ చేశాడు. వారి మనసులో ఏముందో తెలీదు గానీ.. చూసే వారిని మాత్రం ఈ సీన్ చాలా ఆకట్టుకుంది. అంతేకాదు మోనాల్, అఖిల్‌పై రొమాంటిక్ సీన్‌ని అభి డైరెక్ట్ చేయడం కూడా ఎపిసోడ్‌కి హైలెట్‌గా నిలిచింది.
Read More:
Bigg Boss 4: అవినాష్ ఫైర్.. నామినేషన్లలో చూపిస్తానంటూ సవాల్
Bigg Boss 4: సూపర్ సీన్.. అభి డైరక్షన్‌లో ప్రేమించుకున్న అఖిల్, మోనాల్