Bigg Boss 4: అవినాష్ ఫైర్.. నామినేషన్లలో చూపిస్తానంటూ సవాల్
బిగ్‌బాస్ బ్లాక్‌బస్టర్ మూవీ టాస్క్‌లో భాగంగా అవినాష్ పలుమార్లు ఫైర్ అయ్యారు. ఇందులో అవినాష్‌కి స్క్రిప్ట్ రైటర్ పోస్ట్‌ని ఇచ్చారు.
Bigg Boss 4 Avinash: బిగ్‌బాస్ బ్లాక్‌బస్టర్ మూవీ టాస్క్‌లో భాగంగా అవినాష్ పలుమార్లు ఫైర్ అయ్యారు. ఇందులో అవినాష్‌కి స్క్రిప్ట్ రైటర్ పోస్ట్‌ని ఇచ్చారు. అంతేకాదు అవకాశం ఉన్నచోట అతడిని వాడుకోవచ్చునని బిగ్‌బాస్ చెప్పారు. అయితే ఈ టాస్క్‌లో అవినాష్ పలుచోట్ల తన అసహనాన్ని చూపాడు. మొదట డైలాగుల విషయంలో అవినాష్‌కు, దర్శకుడు అభిజిత్‌కి బేధాభిప్రాయాలు వచ్చాయి. స్క్రిప్ట్ రైటర్‌గా తాను డైలాగులు చెప్పినా తీసుకోవడం లేదని అవినాష్ విసుగు చూపించాడు. ఈ విషయంలో అఖిల్, అభికి సపోర్ట్ చేశాడు.
ఇక షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత కూడా నాకు ఫైట్ సీన్ ఇస్తే ఇలా చేస్తా.. అలా చేస్తానంటూ అవినాష్.. సొహైల్, మెహబూబ్‌ల దగ్గర చెప్పాడు. చివర్లో ఓ సీన్‌లో అవినాష్ డైలాగ్ చెప్పబోతుంటే.. లాస్య టచప్‌లు ఇస్తూ, దివి అందరినీ డిస్ట్రబ్ చేస్తూ జోకులు పేల్చారు. దీంతో అవినాష్ బాగా హర్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అరియానా, అవినాష్‌ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. అయితే కావాలని ఇలా చేస్తున్నారు.. తనను ఆడుకుంటున్నారని అవినాష్ నోయెల్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. నామినేషన్స్‌లో అన్నీ చూపిస్తానంటూ ఫైర్ అయ్యాడు. ఇంతలోనే అభిజిత్ వచ్చి అవినాష్‌ను తీసుకెళ్లాడు.
Read More:
Bigg Boss 4: సూపర్ సీన్.. అభి డైరక్షన్‌లో ప్రేమించుకున్న అఖిల్, మోనాల్
Bigg Boss 4: బిగ్‌బాస్ బ్లాక్‌బస్టర్ మూవీ.. అభి, అమ్మ మధ్య బిగ్ ఫైట్