Bigg Boss 4: టాస్క్‌ విజేత.. దివికి బంపరాఫర్‌

బిగ్‌బాస్‌ 4 శుక్రవారం ఎపిసోడ్‌లో భాగంగా ప్రారంభంలోనే ఇంటి సభ్యులకు ఓ టాస్క్‌ ఇచ్చారు. ఇంటి సభ్యులకు ఒక మెత్తటి పరుపును ఇచ్చిన బిగ్‌బాస్‌.

Bigg Boss 4: టాస్క్‌ విజేత.. దివికి బంపరాఫర్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 24, 2020 | 8:45 AM

Bigg Boss 4 Divi: బిగ్‌బాస్‌ 4 శుక్రవారం ఎపిసోడ్‌లో భాగంగా ప్రారంభంలోనే ఇంటి సభ్యులకు ఓ టాస్క్‌ ఇచ్చారు. ఇంటి సభ్యులకు ఒక మెత్తటి పరుపును ఇచ్చిన బిగ్‌బాస్‌.. బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా కలిసి ఆ పరుపు మీద పడుకోవాలని సూచించారు. టాస్క్ ముగిసే సమయానికి ఎవరైతే పరుపుపై పూర్తిగా పడుకుంటారో వాళ్లు గెలిచినట్లు వివరించారు. ఇక ఆ విజేత ఈ వారం మొత్తం ఆ పరుపు మీద పడుకోవచ్చు. అలాగే అందరిలా కాకుండా ఉదయం ఓ గంట సేపు ఎక్కువగా పడుకోవచ్చునని సూచించారు. ఇక ఈ టాస్క్ చాలా రసవత్తరంగా సాగగా.. ఒకరి మీద ఒకరు పడిపోయి, కాళ్లు చేతులు లాక్కుంటూ రచ్చరచ్చ చేశారు. ఇలా ఈ టాస్క్‌లో దివి విజేతగా నిలవగా.. ఆమెకు ఓ గంట ఎక్కువ సేపు నిద్రపోయే అవకాశం వచ్చింది.

Read More:

Bigg Boss 4: ఆసక్తికర సన్నివేశం.. అభికి అఖిల్‌కి సపోర్ట్‌

Bigg Boss 4: అవినాష్‌ ఫైర్‌.. నామినేషన్లలో చూపిస్తానంటూ సవాల్‌