AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు వారరాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Weekly Horoscope in TeluguImage Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2023 | 4:00 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రధాన గ్రహాల స్థితిగతులు మీకు ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి లాభాల పంట పండుతుంది. ఐటీ నిపుణులకు విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. బంధువుల రాకతో కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానయోగ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇవి కూడా చదవండి

ఒకటి కంటే మించి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విహారయాత్రలకు వెళతారు. అదనపు ఆదాయం కోసం ఆరాటం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. పిల్లలు చదువులోనూ, ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం కావచ్చు. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కానీ, మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. ఆదాయపరంగా శుభవార్త వింటారు. డబ్బు జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వాములతో ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటారు. కొందరు స్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది. కొంచెం సహనంతో వ్యవహరిస్తే మీ లక్ష్యాలు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఇల్లు కొనుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి ఎక్కువవుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. డబ్బు నష్టం జరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. వ్యక్తిగత జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు పడతారు. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వారు ఉంటారు. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి, చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అన్ని విధాలుగాను కలిసివచ్చే కాలం ఇది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు కొద్దిగా ఉపశమనం పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. సంతానం లేని వారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. సన్నిహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది. చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు సంపాదనకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల్లో ఉన్నవారు బాగా బిజీ అవుతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు చికాకు పెడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సహచరులలో కొందరు మీ గురించి చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే సూచనలున్నాయి. ఎంతో శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల చిక్కుల్లో పడతారు. అతి ముఖ్యమైన కోర్టు కేసు ఒకటి వాయిదా పడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు. ఆర్థిక లావాదేవీలు లాభంచకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉంది. కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. సమీపబంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలగజేస్తుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇరుగుపొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. ఆలయాలుసందర్శిస్తారు. పిల్లల వల్ల సంతోషం పొందుతారు.  విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

మరిన్ని ఆస్ట్రో కథనాలు చదవండి..