Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Astrology: మరింత దూకుడుగా శుక్రుడు.. ప్రేమ ప్రయత్నాల్లో ఈ రాశులు సక్సెస్!

శుక్రుడు మేష రాశిలోని భరణి నక్షత్రంలో సంచరించి మరింత దూకుడుగా వ్యవహరించనున్నాడు. దీని ప్రభావం ప్రేమ, వివాహ, శృంగార జీవితాలపై ప్రభావం పడుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు ప్రేమ, వివాహ జీవితంలో సానుకూల మార్పులను అనుభవిస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి, దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

Love Astrology: మరింత దూకుడుగా శుక్రుడు.. ప్రేమ ప్రయత్నాల్లో ఈ రాశులు సక్సెస్!
Love Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 13, 2025 | 4:36 PM

Share

మేష రాశిలో తన సొంత నక్షత్రమైన భరణి నక్షత్రంలో ప్రవేశించిన శుక్రుడు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, సుఖ సంతోషాలకు సంబంధించిన శుక్రుడు అగ్ని తత్వం కలిగిన మేషరాశిలో తన స్వనక్షత్రంలో సంచారం వల్ల మరింతగా పేట్రేగి పోయే అవకాశం ఉంటుంది. ప్రేమల్లోనూ, వైవాహిక జీవితంలోనూ, శృంగార కార్యకలాపాల్లోనూ శుక్రుడి జోరు పెరుగుతుంది. తమ మనసులోని భావాలను, ఉద్దేశాలను మరింత ప్రస్ఫుటంగా వ్యక్తం చేసుకోగలుగుతారు. ఈ నెల 26 న రాశి మారే లోపు శుక్రుడు మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారి ప్రేమ, వైవాహిక జీవితాలను కొత్త పుంతలు తొక్కిస్తాడు.

  1. మేషం: ఈ రాశిలో మరో రెండు వారాల పాటు శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారు ప్రేమించడంలోనూ, ప్రేమించబడడంలోనూ ఒక అడుగు ముందుంటారు. ప్రేమ, దాంపత్య బంధాలు పటిష్టం అవుతాయి. ప్రేమ జీవితంలో ఇద్దరి మధ్యా అవగాహన సాన్నిహిత్యం పెరుగుతాయి. ఇది దంపతులకు కూడా వర్తిస్తుంది. ఆదర్శవంతులైన వ్యక్తి ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామిగా లభ్యమయ్యే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో బంధం ఏర్పడే అవకాశం ఉంది.
  2. మిథునం: స్నేహితులతో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ప్రేమ లేదా పెళ్లి విషయంలో మీ కలలు సాకారమవుతాయి. ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. చిన్న చిన్న విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కూడా ఇద్దరి మధ్యా అనుబంధం మరింత పటిష్టం అవుతుంది. పెళ్లయినవారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రేమ జీవితంలో కొత్త అడుగుపెట్టినవారికి తప్పకుండా పెళ్లి యోగం పడుతుంది.
  3. సింహం: సాధారణంగా సహ ఉద్యోగితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లడానికి, దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. సుఖ సంతోషాలకు, మానసిక ప్రశాంతతకు అవకాశం ఉంది. కొత్తగా ప్రేమలో పడినవారు తప్ప కుండా విజయాలు సాధిస్తారు. ప్రేమల్లోనూ, దాంపత్యంలోనూ కొత్త పుంతలు తొక్కుతారు. ఇద్దరి మధ్యా అవగాహన, సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి. దంపతులకు సంతాన యోగం కలుగుతుంది.
  4. తుల: ప్రేమలు, పెళ్లిళ్లు, దాంపత్య జీవితానికి సంబంధించిన సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రేమ జీవితం ప్రారంభం కావడానికి, వైవాహిక జీవితం కొత్త పుంతలు తొక్కడానికి బాగా అవకాశం ఉంది. యువతీ యువకుల మధ్య అతి తక్కువ సమయంలో బంధం దృఢమవుతుంది. సాధారణంగా పరిచయస్థుల్లో లేదా స్నేహితుల్లో ప్రేమ భాగస్వామి లభ్యం కావడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లయ్యే లేదా ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల తప్పకుండా ప్రేమ జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితమే కాక, వైవాహిక జీవితం కూడా అన్నివిధాలా అనుకూలంగా సాగి పోతుంది. మీలోని సానుకూల దృక్పథం వల్ల ప్రేమ జీవితం ఎటువంటి సమస్యలూ, ఇబ్బందులూ లేకుండా పురోగతి చెందుతుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. ప్రేమ జీవితం పెళ్లికి దారి తీస్తుంది.
  6. మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రేమ జీవితంలోనూ, వైవాహిక జీవితంలోనూ సుఖ సంతోషాలకు లోటుండదు. ప్రేమికుల కలలు, ఆశలు, కోరికలు నెరవేరుతాయి. ప్రేమ జీవితంలో ఈ రాశివారు దూసుకుపోతారు. ప్రేమికుల మధ్య స్వల్ప వ్యవధిలో నమ్మకం, సాన్నిహిత్యం, అవగాహన వృద్ధి చెందుతాయి. పెళ్లి జీవితంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కారమై, అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికులు, దంపతులు ఎక్కువగా విహార యాత్రలు చేయడం జరుగుతుంది.