Zodiac Signs: ఈ 5 రాశులవారు ద్రోహాన్ని అస్సలు సహించరు.. మిమ్మల్ని వదిలి వెళ్లిపోతారు! ఆ రాశులేంటంటే?

Zodiac Signs: ఈ 5 రాశులవారు ద్రోహాన్ని అస్సలు సహించరు.. మిమ్మల్ని వదిలి వెళ్లిపోతారు! ఆ రాశులేంటంటే?
Zodiac Signs

బంధం ఏదైనా దాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ఉదాహరణకు ప్రేమ బంధాన్ని తీసుకోండి.. ప్రేమించడం అందరూ చేస్తారు...

Ravi Kiran

|

Nov 11, 2021 | 10:23 AM

బంధం ఏదైనా దాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ఉదాహరణకు ప్రేమ బంధాన్ని తీసుకోండి.. ప్రేమించడం అందరూ చేస్తారు. కాని కొందరు మాత్రమే ఆ బంధాన్ని చివరి వరకు నిలబెట్టుకోగలరు. మరికొందరు మధ్యలోనే తమ భాగస్వామిని వదిలేసి వెళ్లిపోతారు. దానికి కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ఏ బంధంలోనైనా ద్రోహం అనేది ఉండకూడదు. అన్నింటినీ తునాతునకలు చేయడానికి అదొక్కటి చాలు. తమను మోసం చేసినా, ద్రోహం చేసినా తట్టుకోలేనివారు కొంతమంది ఉంటారు. వారి పరిభాషలో ‘క్షమాపణ’ అనేది పదం ఉండదు. వారు మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతారు. అలాంటివారిని జోతిష్యశాస్త్రం ప్రకారం చెప్పవచ్చు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం..

1. కుంభరాశి:

తమ ప్రియమైన వారికి సులభంగా అబద్దం చెప్పడం లేదా మోసం చేసే వ్యక్తులను ఈ రాశివారు అస్సలు సహించరు. ఒకవేళ వారి భాగస్వామి వారికి అబద్దం చెప్పినట్లయితే.. వారిని విడిచిపెట్టేందుకు కూడా వెనుకాడరు. ఒకవేళ వారి భాగస్వామి క్షమాపణ చెబితే, పైకి క్షమించినట్లుగా ప్రవర్తిస్తారు గానీ.. చేసిన ద్రోహాన్ని మాత్రం అస్సలు మర్చిపోలేరు.

2. సింహరాశి:

సాధారణంగా ఈ రాశివారు దయాగుణం కలిగినవారు. మిగతావారు తమకు విధేయులుగా ఉండాలని అనుకుంటారు. తమ దయకు అర్హులు కానివారికి అస్సలు పట్టించుకోరు. అలాగే ఎదుటివారికి రెండో అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా వారికి ఉండదు. అసలు అలాంటి పదం వారి డిక్షనరీలో లేదు.

3. వృశ్చికరాశి:

ఎవరైనా మోసం చేసినా, ద్రోహం చేసినా.. వీరికి అస్సలు నచ్చదు. వారిని వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడరు. ఎందుకంటే వారి డిక్షనరీలో క్షమాపణ అనే పదం లేదు. ప్రతీ విషయాన్ని పర్సనల్‌గా తీసుకుంటారు. చిన్న పొరపాటును కూడా సహించలేరు. ఈ రాశివారు నమ్మదగిన వ్యక్తులు అయినప్పటికీ.. వీరితో స్నేహాబంధంలో ఎక్కువ కాలం ఉండలేం.

4. వృషభరాశి:

ఈ రాశివారు చాలా నమ్మకమైన వ్యక్తులు. తమ ప్రియమైనవారు మోసం చేస్తే అస్సలు సహించలేరు. అయితే వారిని క్షమించాల్సిన విషయంలో కొంత సమయం తీసుకుంటారు. పరిస్థితిని విశ్లేషించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యక్తులు వారి నమ్మకాన్ని వొమ్ము చేసినవారిని అస్సలు క్షమించరు.

5. మేషరాశి:

ఈ రాశివారు ద్రోహాం చేసినట్లుగా భావిస్తే.. తమకు అన్యాయం చేసిన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని కురిపిస్తారు. ద్రోహం/మోసం చేసిన వ్యక్తులను వీరు సులభంగా క్షమించరు. అలాంటివారికి వీరి జీవితంలో స్థానం ఉండదు. నమ్మకం, నిజాయితీ గురించి పట్టించుకోని వ్యక్తులపై సమయాన్ని అస్సలు వృధా చేయరు.

గమనిక: ఈ వార్త మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

Also Read:

3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu