Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్షన్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!
Viral Video: 'నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అని పెద్దలు అంటుంటారు. అలాగే మనదేశంలో క్రియేటివిటీకి కొదవలేదు...
‘నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అని పెద్దలు అంటుంటారు. అలాగే మనదేశంలో క్రియేటివిటీకి కొదవలేదు. ఎంతోమంది వ్యక్తులు తమలోని ప్రతిభను వెలికితీస్తూ ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్లు కనిపెడుతున్నారు. మరీ ముఖ్యంగా అక్కర్లేని వస్తువులతో చేసే కొత్త కొత్త ఇన్వెన్షన్లు చూపరులను విశేషం ఆకట్టుకుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఓ వ్యక్తి గొప్ప ఇన్వెన్షన్ చేశాడు. తన పనిని సులభం చేసుకునేందుకు అతడు బైక్‌ను ఉపయోగించి చేసిన ఇన్వెన్షన్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన తర్వాత ఒక్క క్షణం మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఆ వ్యక్తి.. దీనిని ఎలా చేయగలిగాడని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే..
వైరల్ వీడియో ప్రకారం.. హైవే రోడ్డుపై ఓ వ్యక్తి తన బైక్‌కు రంగులరట్నాన్ని బిగించి నడుపుతుండటం మీరు చూడవచ్చు. ఇక ఆ ఉయ్యాలకు అతడు ఓ కారు స్టీరింగ్‌ను ఆ రంగుల రట్నాంకు ఫిక్స్ చేశాడు. ఒక చేత్తో బైక్‌ను, మరో చేత్తో జెయింట్ విల్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ స్టీరింగ్‌ను తిప్పుతున్నాడు. అది కూడా యమా స్పీడ్‌గా వెళ్తున్నాడు. అంతేకాకుండా ఆ జెయింట్ విల్‌లో అతడి ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నాడు. ఇక దీనంతటిని పక్కనే ఓ కారులో వెళ్తున్న వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేశాడు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కాగా, ఈ వీడియోను ‘siddhesh sawant’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనికి ‘మా సొంత వలస ఇంజనీర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘అతడిది అమేజింగ్ టాలెంట్’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇది నిజంగానే అద్భుతమంటూ’ ఇంకొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.
@anandmahindra Rec’d this as forward on WhatsApp. Our own migrant engineer #Desijugad #lockdown pic.twitter.com/4RCzrCihpE
— Siddhesh Sawant (@sids_sawant) May 17, 2020
Also Read:
అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!
ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!