Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!

జోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతీ మనిషి వ్యక్తిత్వంపై వారి రాశిచక్రం ప్రభావం ఉంటుంది. ఇక అందరూ కూడా తాము చేపట్టబోయే పని ముందు..

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 10, 2021 | 10:41 AM

జోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రం ప్రభావం ప్రతీ మనిషి వ్యక్తిత్వంపై ఉంటుంది. ఇక అందరూ కూడా తాము చేపట్టబోయే పని ముందు ప్రతీ రోజూ రాశిఫలాలను ఒకసారి పరిశీలించుకుంటారు. ఇదిలా ఉంటే మనుషుల్లో రెండు రకాలవారు ఉంటారు. ఎలాంటి కష్టమొచ్చినా.. నవ్వుతూ.. దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగేవారు కొందరైతే.. కొంచెం కష్టమొచ్చినా కూడా అస్సలు తట్టుకోలేనివారు మరికొందరు. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు ప్రతీ చిన్న విషయానికి సులభంగా కన్నీళ్లు పెట్టుకుంటారు.

విషయం చిన్నదైనా, పెద్దదైనా దాన్ని మనస్సుకు తీసుకుంటారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. మిగిలినవారి మాదిరిగానే పైకి ధైర్యంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం భయపడుతూనే ఉంటారు. ఇలాంటివారు అందరితోనూ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఒత్తిళ్లు వచ్చినా, ఆందోళనలు కలిగినా వారి బాధను కన్నీళ్ళతోనే తీర్చుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కోవకు చెందిన 3 రాశులు ఉన్నాయి. అవేంటంటే.!

సింహరాశి:

ఈ రాశివారు పైకి అహంకారులుగా, కఠినమైనవారిగా కనిపించినా.. లోపల మాత్రం అత్యంత ఎమోషనల్. వీరి మనసు స్వచ్చంగా ఉంటుంది. ఎవరైనా కూడా వీరిని పట్మాటించుకోకపోయినా.. చెప్టపే మాటలు వినకపోయినా సులభంగా హార్ట్ అయిపోతారు. వీరిలోని ఎమోషనల్ సైడ్‌.. వారు పూర్తిగా నమ్మినవారు మాత్రమే చూడగలరు. ఈ వ్యక్తుల్లో దయాగుణం ఎక్కువే.

కుంభరాశి:

ఈ రాశివారు చాలా ఎమోషనల్, మానసికంగా బలహీనంగా ఉంటారు. వీరిని మధురమైన మాటలు, చర్యలతో ఈజీగా పడేయొచ్చు. ఈ రాశివారు మిగతావారిని తేలిగ్గా నమ్మేస్తారు. వీరు నిరాశపడితే ఒంటరిగా కూర్చుని తనలోని బాధను కన్నీళ్లతో తగ్గించుకుంటారు.

మీనరాశి:

ఈ రాశివారు పైకి ధైర్యంగా ఉన్నప్పటికీ.. లోపల మాత్రం బాగా భావోద్వేగపరులు. చుట్టూ ఏం జరుగుతోందన్నది పెద్దగా పట్టించుకోరు. ప్రతీ చిన్న విషయానికి ప్రభావితమవుతారు. అయితే వీరు బాధపడినట్లుగా ఎప్పుడూ బయటికి చూపించరు. అతడికి మనస్సే ఆయుధం. ఏ బాధను బయటికి తెలియకుండా తన భావాలను దాచడంలో వీరు నేర్పరులు.

గమనిక: ఈ వార్త మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

Also Read:

అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!

ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!