Horoscope Today: వీరికి మానసిక ఆందోళన పెరుగుతుంది.. ఈరోజు రాశి ఫలాలు..
రోజులో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు చాలా వరకు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి
రోజులో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు చాలా వరకు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు నవంబర్ 11న చంద్రుడు మకర రాశిలో ఉంటాడు.. దీంతో ఈరోజు మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేష రాశి.. ఈరోజు వీరు ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. అలాగే ఉద్యోగాలలో.. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టిన పనులు విజయవంతం కాలేవు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి.. ఈరోజు వీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మిథున రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆద్యాత్మక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవు. ప్రయాణాలు ఎక్కువవుతాయి. కర్కాటక రాశి.. ఈరోజు మీకు కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. రుణ ప్రయత్నాలు పెరుగుతాయి. సింహ రాశి.. ఈరోజు వీరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మనసులో భయం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. కన్య రాశి.. ఈరోజు వీరు కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. తుల రాశి.. ఈరోజు వీరి మనసు చంచలంగా ఉంటుంది. కుటుంబంలో విరోధం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కొత్త వారికి దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి.. ఈరోజు వీరు కొత్త పనులు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వృథా ప్రయాణాలు పెరుగుతాయి. ఉద్యోగం.. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయాత్నాలు పెరుగుతాయి. ధనస్సు రాశి.. ఈరోజు వీరికి అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆనందంగా గడిపేస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. మకర రాశి.. ఈరోజు వీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కొత్త పనులు చేపడతారు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కలుగుతుంది. కుంభ రాశి.. ఈరోజు వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. మీన రాశి.. ఈరోజు వీరు ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కోంటారు. మానసిక ఆందోళన ఏర్పడుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.
Also Read: Keerthy Suresh: కీర్తిసురేష్‌లోని అద్భుతమైన టాలెంట్‌ను బయటపెట్టనున్న తమన్.. అదేంటంటే..
Vijay Devarakonda : బాలీవుడ్‌లో సొంత గొంతు వినిపించనున్న విజయ్ దేవరకొండ.. దేనికోసం అంటే..
Akhanda: బాలయ్య అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అఖండ మూవీ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..