AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: బాలయ్య అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అఖండ మూవీ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..

నటసింహం నందమూరి అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సినిమా అఖండ. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతోంది.

Akhanda: బాలయ్య అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అఖండ మూవీ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..
Akhanda
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 11, 2021 | 6:17 AM

Share

Akhanda: నటసింహం నందమూరి అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సినిమా అఖండ. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తుంది. గతంలో బోయపాటి బాలయ్య తో కలిసి సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. దాంతో అఖండ సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి. ఇప్పటికే విడుదలైన అఖండ సినిమా పోస్టర్లు , టీజర్లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన టైటిల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. మిలియన్ల కొద్ది వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అఖండ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేయాలని చూస్తున్నారు.

అఖండ సినిమా ట్రైలర్ కోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 15వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించగా .. తమన్ సంగీతాన్ని అందించాడు. బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే జగపతి బాబు కీలక పాత్రలో నటించనున్నారు. అఖండ  సినిమాలో రైతుగా.. అఘోరగా బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అలాగే డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి :  

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!