Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

RRR Movie Song: ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషన్స్..

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..
Rrr Movie Natu Natu Song
Follow us
Surya Kala

|

Updated on: Nov 10, 2021 | 10:01 PM

RRR Movie Song: ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒకొక్క పాత్రను రివీల్ చేస్తున్న రాజమౌళి తాజాగా నాటు నాటు అంటూ ఓ సాంగ్ ని రిలీజ్ చేశాడు.  పాటలో తారక్, చెర్రీలు చేసే డ్యాన్స్ కోసం ఇరువురు హీరోల అభిమానులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఎదురుచూశారని చెప్పవచ్చు.  అందరి ఆరాటాన్ని తీరుస్తూ చిత్ర యూనిట్ ప్రకటించిన సమయం కంటే ఒక గంట ముందుగానే రిలీజ్ చేసింది. నాటు నాటు అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ ఇప్పుడు యు ట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ ఊర మాస్ సాంగ్ ను చంద్రబోస్‌ రాయగా ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. కీరవాణి సంగీతం అందించగా రాహుల్‌ సిప్లిగంజ్‌ అద్భుతంగా పాడాడు.

వింటుంటేనే ఊపొస్తున్న ఈ పాటకు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వీడియోని ట్విట్టర్ లో రీ ట్వీట్ చేస్తూ.. మెంటల్ అంటూ కామెంట్ చేసింది.

సమంత మాత్రమే కాదు. మన చాలామంది దర్శకులు హీరోలు కూడా ఈ సాంగ్ ని షేర్ చేస్తూ.. కామెట్స్ తో ట్విట్ చేస్తున్నారు.

హీరో సిద్ధార్థ్ సాంగ్ పై స్పందిస్తూ..  ఆత్రుతని అపుకోలేకపోతున్నాను.. భారత చలన చిత్ర పరిశ్రమలో గొప్ప డాన్సర్లెనా చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నాటు నాటు అంటూ మంటపుట్టిస్తున్నారు. ధియేటర్లో ఇక అరుపులే.. ఇదే రాజమౌళి మ్యాజిక్ అంటూ ట్వీట్ చేశాడు.

యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ పాటకు థియేటర్లలో విస్పోటనం ఖాయం అంటూ కామెంట్ చేశాడు.

‘ఇది ఊరనాటు’ అంటూ అనిల్ రావిపూడి ప్రశంసించాడు.

యువ దర్శకుడు బాబీ ‘వాట్ ఏ ఊరనాటు సాంగ్ దిస్ ఈజ్’ అని ట్విట్ చేసి.. రీ ట్విట్ చేశాడు.

హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ‘నాటు’కు పోయింది పాట అని తనదైన శైలిలో కామెంట్ చేశాడు.

Also Read  : మీ స్మార్ట్ ఫోన్‌లో బ్లూ టూత్ ఆన్ చేసి ఉంచుతున్నారా.. అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్..

RRR Movie: నా పాట చూడు నాటు నాటు అంటూ.. కిరాక్ స్టెప్ప్‌తో అదరగొట్టిన తారక్, చెర్రీలు.. l

ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి