Bluetooth: మీ స్మార్ట్ ఫోన్‌లో బ్లూ టూత్ ఆన్ చేసి ఉంచుతున్నారా.. అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్..
Bluetooth: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ఇల్లే లేదు.. స్మార్ట్ ఫోన్ , లాప్ టాప్ ల్లో కనెక్టివిటీ ఆప్షన్లు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి బ్లూటూత్. బ్లూటూత్ విద్యుత్ వినియోగాన్ని..
Bluetooth: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ఇల్లే లేదు.. స్మార్ట్ ఫోన్ , లాప్ టాప్ ల్లో కనెక్టివిటీ ఆప్షన్లు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి బ్లూటూత్. బ్లూటూత్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించబడింది. ఈ డివైజ్ తో ఏ డివైజ్ నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే బ్లూ టూత్ ఆన్ చేసినప్పుడు మీకు తెలియకుండానే మీ లొకేషన్ ఇతరులకు తెలుస్తోందని ఇటీవల ఓ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లోని బ్లూ టూత్ డివైజ్ హాట్ హాట్ టాపిక్ అయ్యింది
నిజానికి స్మార్ట్ ఫోన్ లోని లొకేషన్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. అది వ్యక్తిగత అంశంగా పరిగణింపబడుతుంది కూడా. తాను ఎక్కడ ఉంది అనేది తనకు సంబంధించిన వారికీ తెలియాలా వద్దా అనేది ఆ ఫోన్ యూజర్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అందుకు అనుగుణంగా లొకేషన్ షేర్ ని ఉపయోగిస్తాడు. అయితే ఇపుడు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు లొకేషన్ షేర్ ఆప్షన్ ఆన్ చేయకుండా ఏదైనా పనిమీద బ్లూ టూత్ ని ఆన్ చేసినా మీరు ఉన్న ప్రాంతం వివరాలు మీఫోన్ లో ఉన్నవారికి తెలుస్తాయని అంటున్నారు. ఇదే విషయం తమ అధ్యయనంలో వెల్లడైంది అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాన్ డీగో వెల్లడించింది.
అయితే ఈ విషయాన్నీ తాము మొదట నమ్మలేదని.. అయితే బ్లూ టూత్ ఆన్ చేస్తే లొకేషన్ తెలుస్తుందా లేదా అన్న విషయంపై అనేక మార్లు అధ్యయనం చేసిన మీదట.. అది నిజమేనని తెలిసిందని అంటున్నారు. బ్లూటూత్ ఆన్‌లో ఉన్నప్పుడు నిరంతరం సిగ్నల్‌లను ప్రసారం చేస్తుంది. దీంతో అవతలి వ్యక్తి యూజర్ ఎక్కడ ఉన్నారో గుర్తించడం సులభమని గుర్తించారు.
అధ్యయనం యొక్క సారాంశం ఏమిటంటే.. మీ ఫోన్‌లో బ్లూటూత్ ఆన్‌లో ఉంచితే మిమ్మల్ని ట్రాక్ చేయడం సులభమని గుర్తించారు. వాస్తవానికి లొకేషన్ ట్రాకింగ్‌కు చాలా పరిమితులు ఉన్నాయి. మొదట, సిస్టమ్ స్థిరమైన వాతావరణంలో పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక అంశాలు ట్రాకింగ్ సమయంలో ఆటంకాలు కలిగించవచ్చు. అయితే బ్లూ టూత్ ఆన్ లో ఉంటే సిగ్నల్స్ తో సంబంధం లేకుండా పని చేస్తుంది. అందువలన బ్లూ టూత్ ఆన్ లో ఉంటె.. ప్రతికూల అంశాలతో పనిలేకుండా లొకేషన్ ను ట్రాక్ చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఇప్పుడు ఇలా బ్లూ టూత్ తో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల లొకేషన్ తెలుసుకోవడం ముప్పు తప్పదని అంటున్నారు. తప్పుడు వ్యక్తులకు ఈ మార్గం తెలిస్తే ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే అవసరమైతేనే బ్లూ టూత్ ఆన్ లో ఉంచమని.. లేదంటే ఎప్పుడూ బ్లూ టూత్ ను ఆఫ్ లో ఉంచడం మేలు అంటూ హెచ్చరిస్తున్నారు.
Also Read: చిన్నారుల్లో చిరునవ్వు కోసం ఉచితంగా 37 వేల ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు చేసిన డాక్టర్..