Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!
మరో సిరీస్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్ ఆడనుంది...
మరో సిరీస్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగానే సెలెక్టర్లు టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించారు. టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. యువ క్రికెటర్లు హర్షల్ పటేల్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్‌లకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. అలాగే యుజ్వేంద్ర చాహల్ రీ-ఎంట్రీ, రుతురాజ్ గైక్వాడ్‌కు ఛాన్స్ దక్కడంతో.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు మొత్తం టీమిండియా రూపురేఖలు మారనున్నాయి. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ నేతృత్వంలోని టీ20 జట్టులో చోటు దక్కించుకోని ఆటగాళ్లు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం..!
హార్దిక్ పాండ్యా:
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులో చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్‌గా లేకపోవడం వల్లే టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అలాగే హార్దిక్ పాండ్యాను జాతీయ క్రికెట్ అకాడమీకి పంపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, హార్దిక్ పాండ్యా స్థానంలో వెంకటేష్ అయ్యర్‌ను ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోందట.
చేతన్ సకారియా:
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చేతన్ సకారియా ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అలాగే శ్రీలంక టూర్‌లో కూడా ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అదరగొట్టాడు. అయినా కూడా ఈ ప్లేయర్‌కు టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. సకారియా శ్రీలంకతో 2 టీ20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.
కృనాల్ పాండ్యా:
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కృనాల్ పాండ్యాను కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారు. గతంలో జరిగిన కివీస్ టూర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కృనాల్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కృనాల్ పాండ్యా 20.75 సగటుతో 83 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అలాగే బౌలింగ్‌లో 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు.
దీపక్ హుడా:
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన దీపక్ హుడాకు కూడా టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఈ టోర్నీలో హుడా 5 మ్యాచ్‌ల్లో 97 సగటుతో 175 స్ట్రైక్ రేటుతో 291 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అజింక్యా రహనే:
టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ బ్యాట్స్‌మన్ ముంబై తరఫున అత్యధికంగా 286 పరుగులు చేశాడు. అయినా కూడా టీ20ల్లో రహానే ఫామ్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
రవి బిష్ణోయ్:
ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్‌కు రవి బిష్ణోయ్ కీలక ఆటగాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లోనే 8 వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు కూడా నిరాశే మిగిలింది. ఈ టోర్నమెంట్‌లో రవి బిష్ణోయ్ ఓ హ్యాట్రిక్ కూడా సాధించాడు. బిష్ణోయ్ ఎకానమీ రేటు 6.50 కాగా.. ఇతడిని న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
Also Read:
అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!
ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!