3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?

ఈ ఆటగాడు ఒక్క సెంచరీ చేయలేదు. కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. కేవలం 23 బంతులు ఆడాడు...

3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?
Pakistan
Follow us

|

Updated on: Nov 10, 2021 | 1:59 PM

ఈ ఆటగాడు ఒక్క సెంచరీ చేయలేదు. కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. కేవలం 23 బంతులు ఆడాడు. అయినా ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌గా అవార్డు ఇచ్చింది. అతడెవరో తెలుసా.? పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఆసిఫ్ అలీ. అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులను ఇచ్చింది. ఇందులో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ అసిఫ్ అలీ.. పురుషుల విభాగంలో.. అలాగే ఐర్లాండ్ ఆల్ రౌండర్ లారా డెలానీ మహిళల విభాగంలో గెలుచుకున్నారు.

అక్టోబర్ నెలలో పాకిస్తాన్ తరపున ఆసిఫ్ అలీ మూడు మ్యాచ్‌లలో 52 పరుగులు చేశాడు, 273.68 స్ట్రైక్ రేట్‌తో 23 బంతులు ఆడాడు. టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసిఫ్ 12 బంతుల్లో అజేయంగా 27 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత ఆఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయానికి 24 పరుగులు అవసరం కాగా, ఆసిఫ్ 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ”అర్ధ సెంచరీ, సెంచరీ లేకపోయినా.. జట్టును ఓటమి అంచుల నుండి ఆసిఫ్ అలీ అద్భుతంగా గట్టెక్కించాడని.. అతడు ఈ ఫీట్‌ను రెండుసార్లు చేసాడని” ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యుడు ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆసిఫ్ అలీ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.

లారా డెలానీ అవార్డు గెలుచుకుంది..

మహిళల క్రికెట్ విభాగంలో ఐర్లాండ్ ఆల్ రౌండర్ లారా డెలానీ ‘ప్లేయర్ ఆఫ్ మంత్’ అవార్డు గెలుచుకుంది. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో 3-1 తేడాతో ఐర్లాండ్ గెలుచుకోవడంలో లారా డెలానీ కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో 63 సగటుతో 189 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 27 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టింది. లారా తన కెరీర్‌లో మొత్తంగా 42 వన్డేల్లో 634 పరుగులు చేసింది. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో టీ20ల్లో 787 పరుగులు చేసింది.

Also Read:

అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!

ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!