England vs Pakistan: పాకిస్తాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఇంగ్లండ్.. టీ20, టెస్టులు ఆడేందుకు అంగీకారం.. ఎప్పుడంటే..!
పాకిస్తాన్‌లో పర్యటించేందుకు అన్ని జట్లు వెనకడుగు వేస్తున్న తరుణంలో వెస్టిండీస్ జట్టు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరల్లో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొంది.
England Tour Of Pakistan: పాకిస్తాన్‌లో పర్యటించేందుకు అన్ని జట్లు వెనకడుగు వేస్తున్న తరుణంలో వెస్టిండీస్ జట్టు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరల్లో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లండ్ టీంలు తమ పర్యటనలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చే ఏడాది అంటే 2022 సెప్టెంబర్-అక్టోబర్‌లో ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ జట్టులో పర్యటించేందుకు ప్లాన్ చేసింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బదులుగా 7 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టామ్ హారిసన్ మంగళవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజాతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత హారిసన్ సిరీస్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 కప్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు సెప్టెంబర్-అక్టోబర్‌లో పాకిస్థాన్‌లో పర్యటించి పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ప్రపంచకప్ కోసం ఆ జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది.
2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత పాక్‌కు ఇంగ్లండ్.. టీ20 ప్రపంచ కప్ 2022 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ టీం మరలా పాకిస్థాన్‌కు తిరిగి వస్తుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతుంది. పాకిస్థాన్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్లు, పురుషుల, మహిళల జట్లను బరిలోకి దింపడంలో మా నిబద్ధతను ఇది తెలియజేస్తోందని పీసీబీ విడుదల చేసిన ప్రకటనలో హారిసన్ పేర్కొన్నారు.
యూఏఈలో టీ20 ప్రపంచ కప్ జరగడానికి ముందు, ఇంగ్లండ్ పురుషులతోపాటు మహిళల జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. పురుషుల జట్టు 2 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, పాకిస్థాన్ మహిళల జట్టు టీ20తో పాటు టెస్టు మ్యాచ్‌ల్లో కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్ టీం పాకిస్థాన్ పర్యటన రద్దు కావడంతో ఇరు జట్ల పర్యటనను ఇంగ్లండ్ వాయిదా వేసింది. వాస్తవానికి, భద్రతా కారణాలను చూపుతూ న్యూజిలాండ్ జట్టు టీ20 మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనను కూడా వాయిదా వేసుకుంది.