Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Australia: బ్యాట్స్‌మెన్‌ను బంతితో కొట్టిన ఆస్ట్రేలియా బౌలర్.. జరిమానాతో పాటు సస్పెన్షన్ కూడా.. అసలేమైందంటే?

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో విక్టోరియా వర్సెస్ న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్యాటిన్సన్ దోషిగా తేలడంతో విక్టోరియా ఆటగాడిని సస్పెండ్ చేశారు.

Cricket Australia: బ్యాట్స్‌మెన్‌ను బంతితో కొట్టిన ఆస్ట్రేలియా బౌలర్..  జరిమానాతో పాటు సస్పెన్షన్ కూడా.. అసలేమైందంటే?
James Pattinson
Follow us
Venkata Chari

|

Updated on: Nov 10, 2021 | 3:01 PM

Australian Cricket Team: ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే గురువారం పాకిస్తాన్‌తో తలపడవలసి ఉంది. కానీ, అంతకంటే ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఓ బౌలర్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ బౌలర్‌పై ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించారు. ఈ బౌలర్ పేరు జేమ్స్ ప్యాటిన్సన్. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో విక్టోరియా వర్సెస్ న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్యాటిన్సన్ దోషిగా తేలడంతో విక్టోరియా ఆటగాడిని సస్పెండ్ చేశారు.

మ్యాచ్ చివరి రోజున ప్యాటిన్సన్ ఇలాంటి పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను బౌలింగ్‌లో తన ఫాలో త్రోలో విసిరిన బంతి బ్యాట్స్‌మె‌న్‌ను తాకింది. ఆ బ్యాట్స్‌మెన్ పేరు డేనియల్ హ్యూస్. ప్యాటిన్సన్ వేసిన బంతికి డేనియల్ డిఫెన్సివ్ షాట్ ఆడాడు. అతని స్థానంలో నిలిచాడు. ప్యాటిన్సన్ బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. అయితే డేనియల్ క్రీజులో ఉన్నాడు. బౌలర్ విసిరిన బంతి బ్యాట్స్‌మెన్ కాలికి తాకింది. దాంతో అతను గాయపడ్డాడు. ప్యాటిన్సన్ వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ, డేనియల్స్ కోపం చల్లారలేదు. కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.7ను ఉల్లంఘించినందుకు దోషిగా తేలాడు.

100 శాతం ఫీజు పెనాల్టీ.. ఈ కేసులో ప్యాటిన్సన్‌పై రెండు అభియోగాలు మోపారు. దీంతో సీఏ అతని రుసుములో 100 శాతం జరిమానా విధించింది. దీంతో అతని ఖాతాలో సస్పెన్షన్ పాయింట్లు కూడా చేరాయి. అంటే మార్ష్ కప్‌లో శుక్రవారం ఎంసీజీలోనే న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్ ఆడలేడు. అయితే ఈ నిర్ణయంపై అప్పీలు చేసుకునే హక్కు ప్యాటిన్సన్‌కు ఉంది. నాల్గవ సీజన్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్యాటిన్సన్ దోషిగా తేలడం ఇది నాలుగోసారి. అదే సమయంలో, రెండో స్థాయి ఉల్లంఘన కారణంగా షెఫీల్డ్ షీల్డ్‌లో సస్పెండ్ కావడం ఇది రెండోసారి. 2019లో, ఆటగాడి నుండి అసభ్య పదజాలం ఉపయోగించడం వల్ల అతను సస్పెండ్ అయ్యాడు.

డేనియల్ కృషి ఫలించలేదు.. అంతకుముందు ప్యాటిసన్ డేనియల్‌ను ఔట్ చేసినప్పటికీ ఆ బంతి నో బాల్‌గా మారింది. అయితే విక్టోకియా 174 పరుగుల తేడాతో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన ప్యాటిన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో డేనియల్ అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ, తన జట్టును గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 319 బంతుల్లో 89 పరుగులు చేశాడు.

Also Read: England vs Pakistan: పాకిస్తాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఇంగ్లండ్.. టీ20, టెస్టులు ఆడేందుకు అంగీకారం.. ఎప్పుడంటే..!

3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?