AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Syed Mushtaq Ali Trophy: 4 మెయిడిన్లు.. 2 వికెట్లు.. టీ20లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక భారత బౌలర్..!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను తన కోటాలో మొత్తం నలుగురు మెయిడిన్‌లను వేశాడు.

Syed Mushtaq Ali Trophy: 4 మెయిడిన్లు.. 2 వికెట్లు.. టీ20లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక భారత బౌలర్..!
Syed Mushtaq Ali Trophy Akshay Karnevar
Venkata Chari
|

Updated on: Nov 10, 2021 | 3:46 PM

Share

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను తన కోటాలో మొత్తం నలుగురు మెయిడిన్‌లను వేశాడు. ఈ నాలుగు ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అలాగే రెండు వికెట్లు కూడా తీశాడు.

రెండు చేతులతో బౌలింగ్ చేసిన అక్షయ్.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఫ్రాంచైజీ టీ20లతో సహా ఏ బౌలర్ కూడా తన కోటాలో మొత్తం నాలుగు ఓవర్లలో మెయిడిన్లు వేయలేదు. ఈ మ్యాచ్ సోమవారం మంగళగిరిలో జరిగింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అక్షయ్ జట్టు విదర్భ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. జితేష్ శర్మ అజేయంగా 71, అపూర్వ వాంఖడే 49 పరుగులు చేశారు. అనంతరం మణిపూర్ జట్టు 16.3 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో విదర్భ 167 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వెంకటేష్ అయ్యర్ 4 ఓవర్లలో 2 పరుగులు.. మధ్యప్రదేశ్ యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ కూడా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను 2 పరుగులిచ్చి 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ఫేజ్-2లో అద్భుత ప్రదర్శన చేసిన వెంకటేష్ అయ్యర్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యాడు.

న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి రాహుల్ ద్రవిడ్ పూర్తి స్థాయి కోచ్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా అయిన సంగతి తెలిసిందే.

Also Read: Cricket Australia: బ్యాట్స్‌మెన్‌ను బంతితో కొట్టిన ఆస్ట్రేలియా బౌలర్.. జరిమానాతో పాటు సస్పెన్షన్ కూడా.. అసలేమైందంటే?

England vs Pakistan: పాకిస్తాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఇంగ్లండ్.. టీ20, టెస్టులు ఆడేందుకు అంగీకారం.. ఎప్పుడంటే..!