Zodiac Signs: ఈ 4 రాశులవారు పుట్టుకతోనే లీడర్స్.. మాటలతో ఇతరులను కట్టిపడేస్తారు!
ప్రతీ ఒక్కరిలోనూ నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. అవి పరిస్థితుల బట్టి బయటపడతాయి. అయితే...
ప్రతీ ఒక్కరిలోనూ నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. అవి పరిస్థితుల బట్టి బయటపడతాయి. అయితే కొంతమంది పుట్టుకతోనే నాయకులుగా ఉంటారు. ప్రతీ పనిలోనూ ఆ గుణం తెలుస్తుంది. వారు తీసుకునే నిర్ణయాలు, వేసే ప్రణాళికలు.. ఇతరత్రా విషయాలు బట్టి.. ఆ వ్యక్తులు ‘Born Leaders’ అని చెప్పొచ్చు. జోతిష్యశాస్త్రం ప్రకారం నాయకత్వపు లక్షణాలు ఉన్న ఆ రాశులవారు ఎవరన్నది తెలుసుకుందాం..
మేషరాశి:
ఈ రాశివారికి పుట్టుకతోనే నాయకులు. వారు చేసే ప్రతీ పనిలోనూ ఆ గుణం కనిపిస్తుంది. తమ మాటలతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ పనినైనా తమదైన స్టైల్‌లో చేయడానికి ఇష్టపడతారు.
వృశ్చికరాశి:
ఈ రాశివారు చాలా మొండివారు. వారు చెప్పిందే వేదం అనేలా ఇతరులు నమ్మేటట్టు చేసుకోగలరు. వీరు ఏదైనా పనిని పూర్తి చేయాలని నిర్ణయించినప్పుడు.. ఎంత కష్టమొచ్చినా కూడా దాన్ని పూర్తి చేసిన తర్వాతే మిగతా విషయాలపై దృష్టి పెడతారు. దీని వల్ల వీరికి అప్పుడప్పుడూ శత్రువులు ఏర్పడతారు. ఈ వ్యక్తులు చాలా నిజాయితీపరులు అలాగే కోపంతోనూ ఉంటారు. దీని వల్ల చాలామంది వీరిని చూసి భయపడతారు. ఎవ్వరూ కూడా వీరికి వ్యతిరేకంగా వెళ్లాలని ప్రయత్నించరు.
కుంభరాశి:
ఈ రాశివారు చాలా ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. వీరు పుట్టిన దగ్గర నుంచి పరిస్థితులను అంచనా వేస్తుంటారు. అందుకే ముందుగానే వచ్చే ప్రమాదాన్ని గమనించి.. దాని తగినట్టుగా ఓ అనుభవజ్ఞుడైన వ్యక్తి మాట్లాడినట్లుగా ఇతరులకు సూచనలు ఇస్తారు. వీరి సామర్ధ్యాన్ని ఇతరులు మెచ్చుకుంటారు. అలాగే మార్గదర్శకత్వం కోసం వీరిని తరచూ సంప్రదిస్తారు.
మకరరాశి:
ఈ రాశివారికి ఆలోచనలకు లోటు ఉండదు. ఈ వ్యక్తులు ప్రతీ విషయంపై సుదీర్ఘగా అలోచించి.. అర్ధం చేసుకుంటారు. వీరు చెప్పిందే వేదంగా ఇతరులు భావించాలని అనుకుంటారు. అందుకే ఎవ్వరూ ఎదిరించే ధైర్యం చేయరు.
కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!
ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!
ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?