Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. బుధవారం రాశిఫలాలు..

Today Horoscope: కొన్ని సందర్భాల్లో ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. బుధవారం రాశిఫలాలు..
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 24, 2021 | 8:21 AM

Today Horoscope: కొన్ని సందర్భాల్లో ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. కావున బుధవారం (నవంబర్ 24న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశివారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధువులతో, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

వృషభం: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టే కీలక పనుల్లో ఆచితూచి అడుగు వేయాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

మిథునం: ఈ రాశివారికి శుభకాలం. అనతి కాలంలోనే ఫలితాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక విషయాల్లో ఆచితూచి అడుగేయాలి.

కర్కాటకం: ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆయా రంగాల వారు.. మనోధైర్యంతో ముందుకు సాగితే.. పనులు సాకాలంలో పూర్తవుతాయి. ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం: ఈ రోజు కీర్తిప్రతిష్టలు పెరుగే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య: ఈ రోజు ప్రారంభించిన పనులను పట్టుదలతో సకాలంలో పూర్తిచేస్తారు. శుభ కార్యక్రమాలలో, విందు వినోదాల్లో పాల్గొంటారు. కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశముంది.

తుల: ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

వృశ్చికం: ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనుస్సు: ఈ రాశి వారు బంధుమిత్రుల సహకారంతో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా సహకారం లభిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సూచనలు తీసుకోవాలి.

మకరం: ఈ రోజు కీలక సమస్యను పరిష్కరిస్తారు. చేపట్టిన పనుల్లో ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.

కుంభం: ఈ రాశి వారికి అన్నిరంగాల్లో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతో గొడవలు మంచిది కాదు.

మీనం: ఈ రోజు ఈ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదనలకు దూరంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

Also Read:

Tomato Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. పెట్రోల్‌ను దాటేసిన టమాటా ధర కిలో రూ.140..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..