Tomato Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. పెట్రోల్‌ను దాటేసిన టమాటా ధర కిలో రూ.140..

Tomato Price Hike: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో ఎన్నటూ లేనంతగా

Tomato Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. పెట్రోల్‌ను దాటేసిన టమాటా ధర కిలో రూ.140..
Tomato
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 24, 2021 | 6:29 AM

Tomato Price Hike: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో ఎన్నటూ లేనంతగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయలు ఏం కొనాలన్నా.. కేజీ 60 రూపాయల పైనే పలుకుతోంది. ఇక టమాట ధరలైతే ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోల్ ధరలు లాగే.. టామాట ధరలు కూడా సెంచరీ దాటి దూసుకెళ్తున్నాయి. ఇటీవల పెట్రోల్ ధరలకు కాస్త.. బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే.. టమాట ధరలు మాత్రం ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేస్తున్నాయి. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 నుంచి 30 టామటాల ధరలు తెలుగు రాష్ట్రాల్లో సహా దక్షిణాది రాష్ట్రాల్లో రూ.100 దాటి పరుగులు తీస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతోంది. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తమిళనాడు, కర్ణాటకలో కిలో ధర ఎన్నడూ లేనంతగా రూ.వంద దాటేసింది.

కాగా.. నవంబర్ నెల మొదట్లో టమాట కేజీ ధర రూ.20నే ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.40 మధ్యనే ఉంది. అయితే కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే టమాట రేటు ఆకాశాన్నంటింది. దీనికి ప్రధాన కారణం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలేనని వ్యాపారులు పేర్కొంటున్నారు. దేశంలోనే అత్యధికంగా టమాటాలు పండే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో ఏటా లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. అయితే.. ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొంటున్నారు. దీంతోపాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. దీంతో మార్కెట్‌లో టామోట డిమాండ్ మరింత పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

కాగా.. పెరిగిన టమోట ధరలు మరో నెల రోజుల వరకు తగ్గడం కష్టమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వస్తున్న టమాటా.. మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌, ఛత్తీస్‌గడ్ లోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే వస్తున్నట్లు చెబుతున్నారు. కాగా.. టామాట ధరలు భారీగా పెరగడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Viral Video: దానంతట అదే పడిపోయిన బీర్ గ్లాస్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!

Green Tulsi Plant: ఇంట్లో నిత్యం పూజించే పచ్చని తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే.. చెడు సంకేతమా?.. పూర్తి వివరాలు మీకోసం..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.