My Home – Five Star Award: మైహోమ్ సంస్థకు ప్రతిష్టాత్మక పురస్కారం..‘ఫైవ్ స్టార్’ అవార్డు అందుకున్న రంజిత్ రావు..
My Home - Five Star Award: అభివృద్ది జరగాలి .. కాని పర్యావరణ విధ్వంసం జరగరాదు.. అన్న సూత్రానికి కట్టుబడి ఉన్న మై హోమ్ సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది.
My Home – Five Star Award: అభివృద్ది జరగాలి .. కాని పర్యావరణ విధ్వంసం జరగరాదు.. అన్న సూత్రానికి కట్టుబడి ఉన్న మై హోమ్ సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. గనుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఫైవ్‌స్టార్ రేటింగ్ అవార్డును స్వీకరించారు మైహోమ్ సంస్థ ప్రమోటర్ రంజిత్‌రావు.
అవార్డు స్వీకరించిన మైహోమ్ సంస్థ ప్రమోటర్ రంజిత్ రావు.. పారిశ్రామీకరణతో పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించరాదు. అభివృద్దితో పచ్చదనానికి ముప్పు రాకూడదు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్న సొంత విజన్‌తో పనిచేస్తోంది మై హోమ్ సంస్థ. అందుకే కేంద్ర గనులు, ఖనిజాభివృద్ధిశాఖ నుంచి దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది మైహోమ్ ప్రైవేట్ లిమిటెడ్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (SDF) అమలు కోసం అత్యుత్తమ పనితీరు కనబరిచే లీజులకు 5 స్టార్ రేటింగ్ ఇస్తుంది కేంద్ర మైనింగ్ శాఖ. పర్యావరణానికి ఎలాంటి హానీ తలపెట్టకుండా మైనింగ్ చేయడం, పరిశ్రమలను అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు కేంద్రం నిర్దేశించిన విధివిధానాలను తూచా తప్పకుండా పాటించింది మైహోం ప్రైవేట్ లిమిటెడ్. గనులు, పరిశ్రమల నిర్వహణలో ఫైవ్‌స్టార్ రేటింగ్‌కు సంబంధించి కేంద్ర గనులు, ఖనిజ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా మైహోమ్ సంస్థ ప్రమోటర్ రంజిత్ రావు ఈ అత్యున్నత అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు రంజిత్‌రావు. మైహోం లీజ్ తీసుకున్న గనుల నిర్వహణలో కేంద్ర ప్రమాణాలు పాటించడంతో ఈ అవార్డ్ వరించింది.
ఫైవ్‌స్టార్ రేటింగ్ సిస్టమ్‌ను ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ద్వారా కేంద్ర గనుల శాఖ ప్రవేశపెట్టింది. మైనింగ్ కార్యకలాపాల్లో నిర్ధేశిత ప్రమాణాలను పాటించే సంస్థలకు ఈ రేటింగ్ ఇస్తున్నారు. 2016 నుంచి ఫైవ్‌స్టార్ రేటింగ్ ప్రవేశ పెట్టింది కేంద్ర గనులశాఖ. ఐదో జాతీయ గనులు, ఖనిజ సంపద కాన్‌క్లేవ్‌ను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంబించారు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. గనుల నిర్వహణపై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.. ఐబీఎస్ ఈ రేటింగ్‌ను ఇస్తోంది. ప్రభుత్వం నుంచి లీజ్‌కు తీసుకున్న గనుల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన తరువాతే ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తారు. మైనింగ్ రంగంలో అత్యుతన్న ప్రమాణాలను పాటించడంలో మైహోమ్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది.
అందుకే కేంద్ర గనుల శాఖ ప్రతిష్టాత్మక అవార్డును అందచేసింది. ఈ సందర్భంగా మై హోమ్ సంస్థ కృషిని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. 5వ జాతీయ గనులు, ఖనిజ లవణాల కాన్‌క్లేవ్ సదస్సులో అవార్డుల ప్రదానం జరిగింది. లీజుకు తీసుకున్న గనుల నిర్వహణలో దేశవ్యాప్తంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న 43 కంపెనీలకు ఫైవ్‌స్టార్ రేటింగ్ అవార్డులను అందచేసింది కేంద్ర గనుల శాఖ. దేశాభివృద్దిలో ఖనిజ సంపద చాలా ముఖ్యమన్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. అందుకే గనుల వేలం ప్రక్రియలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. కొత్త గనుల విధానంతో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరిగిందన్నారు. కాగా, కేంద్రం ప్రకటించిన ఫైవ్‌స్టార్ అవార్డును సాధించిన మై హోమ్ గ్రూప్ దేశంలోని అత్యున్నత సంస్థల్లో టాప్‌గా నిలిచింది.
Also read:
Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..
Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..