AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections: నాడు యువతితో చెప్పు దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో..

Assembly Elections: గతంలో లక్నోలో ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయిన విషయం గుర్తుందా?. రోడ్డు మధ్యలో ఓ అమ్మాయి..

Assembly Elections: నాడు యువతితో చెప్పు దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో..
Cab Driver
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 24, 2021 | 6:18 AM

Share

Assembly Elections: గతంలో లక్నోలో ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయిన విషయం గుర్తుందా?. రోడ్డు మధ్యలో ఓ అమ్మాయి క్యాబ్ డ్రైవర్‌ని పాట్ పాట్‌మని చెంప పగలగొట్టింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ అమ్మాయి క్యాబ్ డ్రైవర్‌ను 22 చెంపదెబ్బలు కొట్టింది. ఆ సమయంలో ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. కొందరు అమ్మాయి వైపు నిలిస్తే.. మరికొందరు క్యాబ్ డ్రైవర్‌కు అండగా నిలిచారు.

ఆ దెబ్బలు కొట్టిన అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు గానీ.. దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ మాత్రం మరోసారి చర్చీనీయాంశంగా మారాడు. అయితే, ఈసారి మరెవరో కొట్టలేదు లేండి. క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. సాదత్ ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ లోహియా అంటే శివపాల్ యాదవ్ పార్టీలో చేరాడు. సాదత్ అలీ తాను తిన్న 22 చెంపదెబ్బల ప్రతిధ్వనిని ఇంకా మర్చిపోలేదు. అందుకే.. పురుషులకు కూడా న్యాయం జరిగేలా రాజకీయాల్లోకి వచ్చానని సాదత్ చెప్పుకొచ్చాడు. ఆ చెంపదెబ్బకు సంబంధించి ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని సాదత్ చెప్పుకొచ్చాడు. పురుషులకు అండగా ఉండేందుకే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యానని ప్రకటించాడు.

గతంలో ఏం జరిగిందంటే.. గత జూలై 30న, లక్నోలోని కృష్ణా నగర్ ప్రాంతంలోని అవధ్ కూడలి సమీపంలో సాదత్ అలీ, ప్రియదర్శిని అనే అమ్మాయి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ప్రియదర్శిని డ్రైవర్‌ను సమీపించి.. సాదత్‌ను క్యాబ్ నుంచి కిందకు దింపి చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. నాన్‌స్టాప్‌గా 22 చెంప దెబ్బలు కొట్టింది. యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతుండగా.. కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం, విచారించండ, యువతిని సైతం మందలించడం తతంగం అంతా అలా ముగిసిపోయింది. అయితే, ఆ దెబ్బలను సాదత్ అలీ ఇంకా మర్చిపోలేదు. తనకు అన్యాయం జరిగిందని, తప్పు లేకుండానే శిక్ష అనుభవించాల్సి వచ్చిందని సాదత్ ఆగ్రహంతో ఉన్నాడు. పురుషులకు రక్షణ అనేదే లేకుండా పోతోందని అన్నాడు. పురుషులకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లో వచ్చినట్లు తాజాగా సాదత్ అలీ ప్రకటించాడు. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..