AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..
Akhanda
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2021 | 9:18 PM

Share

Akhanda: న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవలే ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రంలోని గ్రాండ్ విజువల్స్‌, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు.

సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుందట. మ‌రోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ అవ‌నుంది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌నుంది. త‌మ‌న్ మ్యూజిక్‌, ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్స్‌. అంతే కాదు అఘోరాలు ఎందుకు అలా మారుతారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారట. అలాగే దేవుడిని ఎందుకు నమ్మాలి ఏ అంశాలను చూపించనున్నారట. ‘అఖండ” ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27న గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ ఫంక్షన్ జరుగుతుంది.

బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, అలాగే రీసెంట్‌గా విడుద‌ల‌చేసిన ట్రైల‌ర్‌కు విశేషమైన స్పందన ల‌భించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahid Kapoor Jersey Trailer : మరోసారి నటనతో కట్టిపడేసిన షాహిద్.. “జెర్సీ” ట్రైలర్

Naga Chaitanya : “థాంక్యూ” సినిమా నుంచి అక్కినేని నాగచైతన్య ఫస్ట్ లుక్.. అదుర్స్..

Sampoornesh Babu: తూర్పు గోదావరి జిల్లాలో సంపూర్ణేష్‌ సందడి.. స్వచ్ఛంద సంస్థకు విరాళం అందజేత..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?