Anubhavinchu Raja : ప్రతీ మనషిలోనూ ఓ అనుభవించు రాజా ఉంటాడంటున్న దర్శకుడు శ్రీను గవిరెడ్డి
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా.
Anubhavinchu Raja: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. 2016లోనే ఓ రెండు సినిమాలు తెరకెక్కించాను. కానీ అవి అంతగా ఆడలేదు. ఆ తరువాత మళ్లీ ఓ కథ రాసుకున్నాను. అలా అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్లాను. సినిమా మొదలైంది. క్రాక్ సినిమాకు రైటర్‌గా పని చేశాను. బాలకృష్ణ గారితో గోపీచంద్ మలినేని చేయబోతోన్న సినిమాలోనూ రైటర్‌గా పని చేస్తున్నాను.
ప్రతీ మనషిలోనూ ఓ అనుభవించు రాజా ఉంటాడు. డబ్బు, అమ్మాయిలు, సినిమా ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్లో ఇష్టం ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది.. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది ఈ స్టోరీ. నిజంగా అనుభవించడం ఏంటి? అనేది చెప్పే ఎమోషనే ఈ సినిమా. అన్నపూర్ణ స్టూడియోలోకి ఎంట్రీ అవ్వడానికి ఎంతో కష్టపడ్డా… కానీ ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్‌లోనే దర్శకుడిగా చేస్తున్నాను. కథ, విలేజ్ సెటప్, ఎండింగ్‌లోని ఎమోషన్ చెప్పాను. అది బాగా నచ్చి సుప్రియ గారు ఓకే అన్నారు. చైతన్య , నాగార్జున కూడా విన్నారు. వాళ్లకి కూడా నచ్చడంతో సినిమా మొదలైంది.. పూరి జగన్నాథ్ ప్రభావం నా మీద ఉంది. కానీ ఈ సినిమా మీద ఎలాంటి ప్రభావం లేదు. ఫ్యామిలీ సినిమా. కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది. మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు. మనం పుట్టిందే మన ఊరు అనే ఎమోషన్ ఇందులో ఉంటుంది అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :