Naga Chaitanya : “థాంక్యూ” సినిమా నుంచి అక్కినేని నాగచైతన్య ఫస్ట్ లుక్.. అదుర్స్..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రేమమ్ సినిమా తర్వాత నుంచి కథలను ఎంచుకోవడంలో

Naga Chaitanya : థాంక్యూ సినిమా నుంచి అక్కినేని నాగచైతన్య ఫస్ట్ లుక్.. అదుర్స్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2021 | 5:35 PM

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రేమమ్ సినిమా తర్వాత నుంచి కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ కుర్ర హీరో. వరుసగా మజిలీ , లవ్ స్టోరీ సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చైతన్య. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే జోష్ లో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమా థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని టాక్. ఇదిలా ఉంటే నేడు నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో థాంక్యూ సినిమానుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈ పోస్టర్ లో నాగచైతన్య ఎప్పటిలానే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రాశి ఖన్నా కనువిందు చేయనుంది. అలాగే మాళవిక నాయర్ .. అవికా గోర్ కూడా నటించనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఈ సినిమాతోపాటు నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు చైతన్య. ఆసినిమా నుంచి కూడా నేడు నాగచైతన్య ఫస్ట్ లుక్ తోపాటు టీజర్ ను విడుదల చేశారు.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..