Sampoornesh Babu: తూర్పు గోదావరి జిల్లాలో సంపూర్ణేష్‌ సందడి.. స్వచ్ఛంద సంస్థకు విరాళం అందజేత..

టాలీవుడ్‌ బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తూర్పు గోదావరి జిల్లాలో సందడి చేశారు. తన తాజా చిత్రం 'క్యాలీఫ్లవర్‌' ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో పర్యటించారు..

Sampoornesh Babu: తూర్పు గోదావరి జిల్లాలో సంపూర్ణేష్‌ సందడి.. స్వచ్ఛంద సంస్థకు విరాళం అందజేత..
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2021 | 5:52 PM

టాలీవుడ్‌ బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తూర్పు గోదావరి జిల్లాలో సందడి చేశారు. తన తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో పర్యటించారు. అతడితో పాటు ‘క్యాలీఫ్లవర్‌’ హీరోయిన్‌ వాసంతి కూడా ఈ కార్యక్రమాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీయువ సేన స్వచ్ఛంద సంస్థను సంపూర్ణేష్ సందర్శించాడు. వారు చేస్తున్న సహాయ కార్యక్రమాలకు తన వంతు ప్రోత్సాహకంగా రూ. 26వేలు విరాళంగా అందజేశాడు. కాగా సంపూకు ఘనంగా స్వాగతం పలకడానికి అభిమానులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా సినిమాలోని అతడి వేషధారణను తలపించేలా ఫేస్‌ మాస్క్‌లు ధరించి ఆకట్టుకున్నారు.

ఇప్పటికే ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’, ‘బజార్‌ రౌడీ’ వంటి చిత్రాలతో సోలో హీరోగా మెప్పించాడు సంపూర్ణేష్‌. తనదైన కామెడీ స్ఫూప్‌లతో ఆకట్టుకుంటోన్న ఈ హీరో త్వరలో ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త సినిమాతో మ‌న‌ముందుకు రానున్నాడు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

Also Read:

Brahmanandam: మీమ్స్ క్రియేట్ చేస్తున్నవాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్న బ్రహ్మానందం..

Kartik Aaryan: యంగ్‌ హీరో పేరును ట్యాటూగా వేయించుకున్న లేడీ ఫ్యాన్‌.. సెల్ఫీ తీసుకుని థ్యాంక్స్‌ చెప్పిన ‘ధమాకా’ నటుడు..

Republic: ఓటీటీకి సాయి ధరమ్ తేజ్ సినిమా.. రిలీజ్‌కు రెడీ అయిన “రిపబ్లిక్” సినిమా..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే