Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmanandam: మీమ్స్ క్రియేట్ చేస్తున్నవాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్న బ్రహ్మానందం..

నవ్విచడానికే ఆయన పుట్టారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పేరు చెప్పినా.. ఆయన స్క్రీన్ మీద కనిపించినా.. నవ్వు ఆగదు.

Brahmanandam: మీమ్స్ క్రియేట్ చేస్తున్నవాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్న బ్రహ్మానందం..
Brahmanandam
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2021 | 5:08 PM

Brahmanandam: నవ్విచడానికే ఆయన పుట్టారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పేరు చెప్పినా.. ఆయన స్క్రీన్ మీద కనిపించినా.. నవ్వు ఆగదు. ఆయనే నవ్వుల రారాజు బ్రహ్మానందం . కమెడియన్ గా వేల సినిమాల్లో నటించి కోట్ల మందినికడుపుబ్బా నవ్వించారు బ్రహ్మీ. ఇటీవల ఆయన సినిమాల్లో కనిపించడం తగ్గించారు. రీసెంట్‌గా జాతిరత్నాలు సినిమాలో నటించారు బ్రహ్మానందం. తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న టాక్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ టాక్ షోకు అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతో బ్రహ్మానందం- అలీ మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. కావున ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలీకి బ్రహ్మానందానికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడ పుట్టారు.. ఎక్కడ చదివారు.. ఎక్కడ సెటిల్ అయ్యారు అని అలీ ప్రశ్నించగా .. బ్రహ్మానందం నవ్వుతు నీకెందుకురా అని సమాధానం చెప్పారు. ఆతర్వాత అలీని తొలిసారి ఎక్కడ కలిసారో.. ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. ఇక చివరిగా ఆయన మీమర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్నారు బ్రహ్మీ. కొన్ని కారణాల వల్ల ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను.. అయినా నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లు.. అంతే కానీ వాళ్ళమీద కోపడటం చేయను అన్నారు. దాంతో మీమర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బ్రహ్మానందం తమకు ఇంతగా సపోర్ట్ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీమర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Evaru Meelo Koteeswarulu: తారక్‏తో మహేశ్ ముచ్చట్లు మాములుగా లేవుగా.. అదిరిపోయిన ప్రోమో..

Pooja Kannan: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి చెల్లెలు.. అక్కకు ఏమాత్రం తీసిపోని పూజ కన్నన్.. బ్యూటీఫుల్ ఫోటోస్..