Gold Price Today: బంగారం ప్రియులకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం ధర..!

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు ఇది బిగ్‌న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈ రోజు భారీగా దిగి వచ్చింది..

Gold Price Today: బంగారం ప్రియులకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం ధర..!
Follow us

|

Updated on: Nov 24, 2021 | 6:14 AM

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు ఇది బిగ్‌న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈ రోజు భారీగా దిగి వచ్చింది. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. దేశీయంగా బుధవారం (నవంబర్‌ 24) బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,290 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై కూడా అంతే తగ్గుముఖం పట్టింది. మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతుండగా, ఈ మాత్రం మహిళలకు శుభవార్తేనని చెప్పాలి. అయితే కొన్ని నగరాల్లో వెయ్యి రూపాయలకుపైగా తగ్గగా, కొన్ని నగరాల్లో వెయ్యి రూపాయల లోపు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,460 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,150వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

ICRA: రానున్న రోజుల్లో ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయ్‌.. క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా..!

Aadhaar Card Holders: ఆధార్‌ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 166 ఆధార్‌ సేవా కేంద్రాలు..!

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..