- Telugu News Spiritual Spiritual If the green tulsi plant suddenly dries up then it may be a sign of something untoward in home here is the full details
Green Tulsi Plant: ఇంట్లో నిత్యం పూజించే పచ్చని తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే.. చెడు సంకేతమా?.. పూర్తి వివరాలు మీకోసం..
Green Tulsi Plant: తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ మొక్కను భగవంతుని స్వరూపంగా కొలుస్తారు. తులసి మొక్క ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుందని విశ్వాసం. అయితే తులసి ఇంట్లో వచ్చే ప్రమాదాలను కూడా పసిగట్టేస్తుందని మీకు తెలుసా?. ఆ క్రమంలోనే అకుపచ్చని తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. తులసి చెట్టు ఎండిపోవడం దేనికి సంకేతమో తెలుసుకోండి.
Updated on: Nov 24, 2021 | 7:01 AM

ఆకుపచ్చని తులసి యొక్క అకస్మాత్తుగా ఎండిపోయి చనిపోతే.. అది పితృ దోషానికి సంకేతం కావచ్చు. పితృ దోషం వల్ల మనిషి అనేక సమస్యలను ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి కుటుంబంలో తరచూ గొడవల వాతావరణం నెలకొంటుంది.

తులసి మొక్క ఎండిపోవడం బుధ గ్రహానికి సంబంధించినదే. బుధుడు ఏ విధమైన అశుభ ప్రభావాన్ని ఇవ్వబోతున్నా తులసి ఎండిపోతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బుధుడు మేధస్సు, తార్కికం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం,ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం, ప్రసంగం, మాట్లాడే సామర్థ్యం, ఉచ్చారణ, వ్యూహం, కమ్యూనికేషన్, రవాణా, వ్యాపారానికి సంబంధించినది.

ఆకుపచ్చని తులసి యొక్క అకస్మాత్తుగా ఎండిపోయి చనిపోతే.. అది పితృ దోషానికి సంకేతం కావచ్చు. పితృ దోషం వల్ల మనిషి అనేక సమస్యలను ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి కుటుంబంలో తరచూ గొడవల వాతావరణం నెలకొంటుంది.

మొక్కను సరిగ్గా సంరక్షించకపోవడం వల్ల కొన్నిసార్లు ఎండిపోతుందని గుర్తుంచుకోండి. అందుకని తులసి మొక్కను సరిగా చూసుకోండి. కానీ ఎలాంటి కారణం లేకుండా తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే మాత్రం వెంటనే జ్యోతిష్యుడిని గానీ, వేదపండితులను గానీ సంప్రదించడం మంచిది. ఎండిన మొక్కను పారే నీటిలో వదిలేసి.. ఇంట్లో మరో కొత్త మొక్కను నాటాలి.
