Viral Video: దానంతట అదే పడిపోయిన బీర్ గ్లాస్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!

Viral Video: ఒక్కోసారి నమ్మశక్యం కాని ఘటనలు చోటు చేసుకుంటాయి. అదెలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటి గురించి నోటితో చెబితే..

Viral Video: దానంతట అదే పడిపోయిన బీర్ గ్లాస్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!
Beer Glass
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2021 | 6:20 AM

Viral Video: ఒక్కోసారి నమ్మశక్యం కాని ఘటనలు చోటు చేసుకుంటాయి. అదెలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటి గురించి నోటితో చెబితే.. ఏవో కాకమ్మ కథలు చెబుతున్నారని అనుకుంటారంతా. కానీ, ప్రూఫ్స్ చూపిస్తే గానీ దానిని ఎవరూ విశ్వసించరు. అయితే, కొన్ని కొన్ని విచిత్ర ఘటనలను నమ్మక తప్పని పరిస్థితి ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే యూకేలోని సుందర్‌లాండ్‌లో చోటు చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తి బీర్ తాగుతూ.. తన గ్లాస్‌ను పక్కన పెట్టుకున్నాడు. చుట్టు పక్కన ఎవరూ లేరు. కానీ ఆ గ్లాస్ దానంతట అదే పడిపోయింది. అదెలా పడిందో అర్థం కాక.. ఆ వ్యక్తి షాక్ అయ్యారు.

వివరాల్లోకెళితే.. యూకేలోని సుందర్‌లాండ్‌లో స్థానికంగా ఉన్న బ్లూ హౌస్‌ పబ్‌కు ఓ వ్యక్తి వెళ్లాడు. బీర్ తాగుతున్నాడు. రాత్రి సమయంలో జనాలు పెద్దగా లేరు. ఓ వ్యక్తి బీరు తాగుతున్నడా? లేక సాధారణంగా నిల్చున్నడా తెలియదు కానీ, అతని పక్కనే బీరుతో నిండి ఉన్న ఒక గ్లాస్ ఉంది. అక్కడ అతను తప్ప ఇంకెవ్వరూ లేరు. అయితే, ఆ వ్యక్తికి, గ్లాస్‌కు మధ్య గ్యాప్ కూడా చాలానే ఉంది. ఇంతలో ఆ బీర్ గ్లాస్ ఉన్నట్లుండి ఒక్కసారిగా కిందపడిపోయింది. దానికి ఎవరూ తాకలేదు సరికదా.. దాని దరిదాపులో ఎవరూ లేరు. మరి అదెలా పడిందో అర్థం కాక ఆ వ్యక్తి తెగ పరేషాన్ అయ్యాడు. పోనీ ఆ గ్లాస్ పెట్టిన బల్లా సరిగా లేదేమో అనుకుందాం అన్నా.. అది ఫర్‌ఫెక్ట్‌గానే ఉంది. అయినా దానంతట అదే బీర్ గ్లాస్ పోవడం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ఈ ఘటన పబ్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ పబ్ ఓనర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దెయ్యం వల్లే ఆ గ్లాస్ కింద పడిపోయి ఉండొచ్చని, ఎవరికి తోచిన థియరీలు వారు చెబుతున్నారు.

Viral Video:

Also Read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..