Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (June 9, 2025): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం సుఖమయంగా సాగిపోతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 09 June 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 09, 2025 | 6:24 AM

దిన ఫలాలు (జూన్ 9, 2025): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశముంది. వృషభ రాశి వారికి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కొందరు బంధుమిత్తుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా, ఉద్యోగపరంగా శుభప్రదంగా సాగిపోతుంది. అన్ని రంగాల్లోనూ సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం సుఖమయంగా సాగిపోతుంది. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. సుఖాలు, సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆశించిన విధంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులు విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వృథా ఖర్చులకు, విలాసాలపై ఖర్చులకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆర్థికాభివృద్ధి చెందడం జరుగుతుంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశివారికి రోజంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వ్యక్తి గత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో అధికారులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎలాంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. వ్యక్తి గత సమస్యల పరిష్కారంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడి, విశ్రాంతి తగ్గుతుంది. స్వల్ప అనారోగ్యా నికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగి పోతుంది. రావలసిన సొమ్ము చేతికి అందక ఇబ్బంది పడతారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధాలకు బాగా ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. బిగ్ బాస్ కాజల్
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. బిగ్ బాస్ కాజల్
నాగార్జున, ధనుష్‌ల ఎమోషనల్ డ్రామా.. కుబేర సినిమా ఎలా ఉందంటే?
నాగార్జున, ధనుష్‌ల ఎమోషనల్ డ్రామా.. కుబేర సినిమా ఎలా ఉందంటే?
మజ్జిగలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
మజ్జిగలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
కామెర్లు వచ్చినప్పుడు కళ్ళు,గోర్లు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయి
కామెర్లు వచ్చినప్పుడు కళ్ళు,గోర్లు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయి
అఖిల్‌కు తమన్ మ్యారేజ్ గిఫ్ట్ గా ఏమిచ్చాడో తెలుసా? వీడియో ఇదిగో
అఖిల్‌కు తమన్ మ్యారేజ్ గిఫ్ట్ గా ఏమిచ్చాడో తెలుసా? వీడియో ఇదిగో
కుబేర సినిమాను చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ధనుష్..
కుబేర సినిమాను చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ధనుష్..
తేనె, నల్ల మిరియాల పొడి కలిపి తింటే సూపర్‌ బెనిఫిట్స్‌..
తేనె, నల్ల మిరియాల పొడి కలిపి తింటే సూపర్‌ బెనిఫిట్స్‌..
ఫ్యాటీ లివర్ బరువు పెరగడానికి కారణమవుతుందా?
ఫ్యాటీ లివర్ బరువు పెరగడానికి కారణమవుతుందా?
దృశ్యం 3 వచ్చేస్తోంది.. అధికారికంగా ప్రకటించిన మోహన్ లాల్..
దృశ్యం 3 వచ్చేస్తోంది.. అధికారికంగా ప్రకటించిన మోహన్ లాల్..
పాలసీదారుడు, నామినీ ఇద్దరు మరణిస్తే డబ్బు ఎవరికి అందిస్తారు?
పాలసీదారుడు, నామినీ ఇద్దరు మరణిస్తే డబ్బు ఎవరికి అందిస్తారు?