Shani Jayanti: రేపు శని జయంతి.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం చేయాల్సిన దానాలు, నివారణ చర్యలు ఏమిటంటే..
శోభన్ యోగం.. ఈ రోజు రాత్రి 07.37 గంటల నుంచి రేపు సాయంత్రం 06.17 గంటల వరకు ఉండనుంది. ఈ సమయంలో చంద్రుడు దేవగురువు బృహస్పతితో మేష రాశిలో కలుస్తాడు. దీంతో గజ కేసరి యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో శనీశ్వరుడు తన సొంత రాశి కుంభ రాశిలో శని యోగం ఏర్పరచనున్నాడు.
జాతకంలో శనిదోషం ఉంటే జ్యోతిష్య శాస్త్రంలో.. శని దోష నివారణకు కొన్ని చర్యలను సూచించారు. ముఖ్యంగా కర్మ ప్రధాత శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనీశ్వరుడు జన్మదినోత్సవం రోజున పూజించాలి. ఈ ఏడాది శని జయంతి రోజున శోభన్ యోగం కూడా ఏర్పడనుంది. ఈ శోభన్ యోగం.. ఈ రోజు రాత్రి 07.37 గంటల నుంచి రేపు సాయంత్రం 06.17 గంటల వరకు ఉండనుంది. ఈ సమయంలో చంద్రుడు దేవగురువు బృహస్పతితో మేష రాశిలో కలుస్తాడు. దీంతో గజ కేసరి యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో శనీశ్వరుడు తన సొంత రాశి కుంభ రాశిలో శని యోగం ఏర్పరచనున్నాడు. ఈ నేపథ్యంలో శని జన్మదినోత్సవం రోజున శని దోష నివారణ కోసం చేయాల్సిన పూజాది కార్యక్రమాలు, పఠించాల్సిన మంత్రం గురించి తెలుసుకుందాం..
శని జయంతి రోజున పూజా విధానం ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగస్నానమాచరించాలి. శనీశ్వరుడికి పూజ చేసి.. నైవేద్యంగా నేరేడు పండ్లను సమర్పించాలి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. నల్ల మినప్పప్పు, నల్ల నువ్వులు సమర్పించాలి. నువ్వుల నూనెతో దీపం వెలగించాలి. అనంతరం శని చాలీసాను పాటించాల్సి ఉంటుంది. శనీశ్వర జయంతి రోజున ఉపవాసం చేస్తే.. కర్మప్రదాత అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఏర్పడిన కష్టాలు తొలగిపోతాయి.
శని జయంతి రోజున చేయాల్సిన దానాలు ..
- శని జయంతి రోజున కొన్ని రకాల దానాలు చేయడం జీవితంలో ఏర్పడిన కష్ట, నష్టాలు ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆకలి అన్నవారికి అన్నదానం చేయడం వలన మేలు జరుగుతుంది.
- నేరేడు పండ్లు నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు దానం చేయడం వలన అనారోగ్య సమస్యలు తీరతాయి.
- నల్ల బట్టలు, నువ్వులు దానం చేయడం వలన కర్మ ప్రదాత అనుగ్రహం కలుగుతుంది.
- శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో నువ్వుల దీపం వెలిగించి.. ఓం శని శనైశ్చరాయ నమ: అనే మంత్రాన్ని పఠించాలి.
శని దోష నివారణకు అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రం..
ఓం నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజం.. ఛాయామార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరం.. ఓం శం శనైశ్చరాయ నమః
మానవుడు చేసిన కర్మల నుంచి దోష ఫలితాల నివారణ కోసం.. శనీశ్వరుడు అనుగ్రహం కోసం శని జయంతి రోజున పూజ చేస్తే.. ఆయన చెడు దృష్టి తొలగి శుభఫలితాలను అందిస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).