Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dosha: కడుపుకి సంబంచింది అనారోగ్యతో బాధపడుతున్నారా.. శని దోష నివారణకు నేరేడు పళ్లు బెస్ట్ రెమిడీస్..

గ్రహం, నక్షత్రం ఆధారంగా శనిదోష నివారణకు పూజలు చేస్తారు. దీని వల్ల తమ భవిష్యత్తు బాగుంటుందని.. ఎటువంటి కష్టనష్టాలకు.. ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటామని విశ్వాసం.  శని దోష నివారణకు నేరేడు పండ్లు అత్యుత్తమమని విశ్వాసం. శనీశ్వరుడికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టి.. వాటిని ప్రసాదంగా తీసుకోవాలి.

Shani Dosha: కడుపుకి సంబంచింది అనారోగ్యతో బాధపడుతున్నారా.. శని దోష నివారణకు నేరేడు పళ్లు బెస్ట్ రెమిడీస్..
Shani Dosham
Follow us
Surya Kala

|

Updated on: May 18, 2023 | 9:22 AM

జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడుది ప్రముఖ స్థానం.. శనీశ్వరుడు కర్మ ప్రదాత.. శనీశ్వరుడు మనుషులపై చెడు ప్రభావం చూపిస్తే.. కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని చెడుప్రభావాలు మనుషులు చేసే కర్మలకు అనుగుణంగా ఉంటుంది. అందుకనే శని దోషం పడకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు చేస్తారు. గ్రహం, నక్షత్రం ఆధారంగా శనిదోష నివారణకు పూజలు చేస్తారు. దీని వల్ల తమ భవిష్యత్తు బాగుంటుందని.. ఎటువంటి కష్టనష్టాలకు.. ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటామని విశ్వాసం.  శని దోష నివారణకు నేరేడు పండ్లు అత్యుత్తమమని విశ్వాసం. శనీశ్వరుడికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టి.. వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. అంతేకాదు నేరేడు పండ్లను బ్రాహ్మణుడికి దానం చేయడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. రకాల రోగాల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

  1. శనీశ్వరుడు దీర్ఘకాలిక వ్యాధులు, పొట్టలో పేరుకున్న మలినాలు వలన వ్యాధికారకుడు. దీంతో నేరేడు పండ్లు తినడంవలన కడుపులోని మలినాలను శుభ్రపరుస్తుంది. పలు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. నేరేడు పండ్లు శరీరంలోని నిరోధక శక్తిని పెంచుతుంది. మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది. నేరేడు పండు తింటే నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు నయమవుతాయి.
  2. నేరేడు పండ్లను దానం చేయడం వలన శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. నల్లనువ్వులతో కలిపి నేరేడు పండుని దానం  చేయడం వలన శనీశ్వరుడు వలన కలిగే బాధలనుంచి ఉపశమనం లభిస్తుంది.
  3.  నేరేడు పండ్లను శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి.. వాటిని బిచ్చగాళ్ళకు దానం చేస్తే ఆర్ధిక ఇబ్బందులు తీరతాయాని విశ్వాసం.
  4. నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం.
  5. ఇవి కూడా చదవండి
  6. శనీశ్వరుడి అనుగ్రహం కోసం పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే శుభఫలితాలు ఉంటాయని విశ్వాసం.
  7. ఎవరికైనా భోజనం పెట్టె సమయూరంలో నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే వారికి జీవితంలో అన్నానికి లోటు ఉండదని విశ్వాసం.
  8. నేరేడు పండు శని దోష నివారణకు శని దేవునికి నైవేద్యంగా సమర్పించినా, ఎవరికైనా దానం చేసినా సత్ఫలితాలు ఇస్తాయని.. శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ