AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: గంగా రామాయణ ఆధ్యాత్మిక యాత్ర.. తక్కువ ధరలో కాశి,వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యను దర్శించండి.. వివరాల్లోకి వెళ్తే

గంగా రామాయణ్ యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ యాత్రలో భాగంగా కాశి, సారనాధ్, ప్రయాగ్ రాజ్, నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. 5 రాత్రులు, 6 పగళ్లు సాగనున్న ఈ గంగా రామాయణ్ యాత్ర వివరాల గురించి తెలుసుకుందాం..

IRCTC Tour: గంగా రామాయణ ఆధ్యాత్మిక యాత్ర.. తక్కువ ధరలో కాశి,వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యను దర్శించండి.. వివరాల్లోకి వెళ్తే
Irctc Ganga Ramayan Yatra
Surya Kala
|

Updated on: May 18, 2023 | 7:32 AM

Share

వేసవి వినోదంగా భారత దేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాలని ఆలోచిస్తున్న వారికీ  ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్  నుంచి వివిధ ప్రాంతాలను దర్శించేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. తాజాగా గంగా రామాయణ్ యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ యాత్రలో భాగంగా కాశి, సారనాధ్, ప్రయాగ్ రాజ్, నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. 5 రాత్రులు, 6 పగళ్లు సాగనున్న ఈ గంగా రామాయణ్ యాత్ర వివరాల గురించి తెలుసుకుందాం.. 2023 మే 25న, తిరిగి జూన్‌ 7న గంగా రామాయణ్ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే మే నెలకు సంబంధించిన టికెట్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీన పర్యటన కోసం వెళ్లాలనుకునేవారి కోసం వివరాలు మీ కోసం..

ఈ టూర్‌ ప్యాకేజీలో  భాగంగా మొదట హైదరాబాద్‌ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రలో చివరి రోజున లఖ్‌నవూ నుంచి బయలుదేరి హైదరాబాద్‌ కు చేరుకోవడంతో సంపూర్ణమవుతుంది.

యాత్ర షెడ్యూల్..

ఇవి కూడా చదవండి

Day-1: ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి..  వారణాసికి చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు చేరుకొని ప్రెష్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం.. కాశీ విశ్వనాథుడి దర్శనానికి తీసుకునివెళ్లారు. అనంతరం గంగా ఘాట్ ను దర్శించుకునేందుకు తీసుకుని వెళ్లారు. ఈ విశ్వనాథుడి, ఘాట్ దర్శనం కోసం అయ్యే ఖర్చుని యాత్రికులే భరించాల్సి ఉంటుంది. రాత్రి కాశీలోని బస చేయాల్సి ఉంటుంది.

Day-2: రెండో రోజు ఉదయం కాశీలో టిఫిన్ తీసుకుని అనంతరం సారనాథ్ కు వెళ్లి.. అక్కడ శివయ్య దర్శనం అనంతరం.. మధ్యాహ్నం వారణాశికి చేరుకుంటారు. కాశీలో రెండవ రోజు బిర్లా టెంపుల్, ఘాట్స్ దర్శనం, షాపింగ్ చూసుకోవచ్చు. రాత్రి వారణాసిలో బస చేయాల్సింది ఉంటుంది.

Day-3: మూడో రోజు ఉదయం కాశి నుంచి వెకేట్ చేసి.. ప్రయాగ్ రాజ్ చేరుకొని త్రివేణి సంగమం, అలోపీ దేవీ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అయోధ్యలో బస చేయాల్సి ఉంటుంది.

Day-4: నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత అయోధ్యలోని రామాలయాన్ని సరయు నదిని సందర్శించవచ్చు. మధ్యాహ్నం అయోధ్య నుంచి లఖ్‌నవూ చేరుకొని రాత్రి అక్కడే హోటల్‌లోబస చేయాల్సి ఉంటుంది.

Day-5: ఐదో రోజు లఖ్‌నవూలోని హోటల్‌లో టిఫిన్ తిన్న తర్వాత నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా నైమిశరణ్యంలో గడిపి సాయంత్రానికి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి లఖ్‌నవూలోనే బస చేయాల్సి ఉంటుంది.

Day-6: ఆరో రోజు ఉదయం టిఫిన్ ముగించుకొని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ను సందర్శించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం హోటల్‌ చేరుకొని.. సాయంత్రం 4 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విమానంలో హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో గంగా రామాయణ్ యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు  హైదరాబాద్‌ నుంచి వారణాసి, లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు ప్లైట్ టికెట్స్ తో పాటు.. వారణాసి, అయోధ్య, లఖ్నావూ లో హోటల్ లో బస, టిఫిన్, ఐదు రోజులు రాత్రి భోజనం, ఒక రోజు మధ్యాహ్నం భోజన సదుపాయాలను కల్పిస్తోంది. అంతేకాదు భీమా సౌకర్యం కూడా ఉంది. అయితే పర్యటక ప్రాంతాల్లో ఇతర సందర్శనీయ ప్రదేశాలు, ఆలయ దర్శనం టికెట్స్ ధరలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.

ప్యాకేజీ ధరలు: సింగిల్‌ ఆక్యుపెన్సీ – రూ.36,850

డబుల్‌ ఆక్యుపెన్సీ – ఒకొక్కరికి రూ.29,900

ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ- ఒకొక్కరికి రూ.28,200

5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు – రూ.24,600 (బెడ్ సదుపాయం కల్పిస్తారు)’

2 నుంచి 4 ఏళ్ల లోపు చిన్నారులకు- రూ.18,300 చెల్లించాల్సి ఉంటుంది.

టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే..

ఈ టూర్ మొదలు కావడానికి 7 రోజుల ముందు వరకు మాత్రమే టికెట్‌ రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు నిర్దేశిత మొత్తాన్ని రీఫండ్‌ కింద చెల్లిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!