Shani Jayanti 2023: శనీశ్వరుడికి కాకి సహా 9 వాహనాలు .. ప్రాముఖ్యత, ఫలితాలు ఏమిటంటే
శనీశ్వరుడు ప్రస్తావన వస్తే.. అతని వాహనం అయిన కాకి గురించి ఆలోచిస్తారు. అయితే శనీశ్వరుడు ఒక్క కాకిమీద మాత్రమే కాదు మొత్తం 09 వాహనాలపై ప్రయాణిస్తాడని పురాణాల కథనం. విశేషమేమిటంటే ఈ వాహనాలన్నింటికీ భిన్నమైన హిందూ మతపరమైన ప్రాముఖ్యత ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం, శని అనుగ్రహం కోరుకునే వారు పొరపాటున కూడా ఈ వాహనాలను ఇబ్బంది పెట్టకూడదు.
సనాతన హిందూ సంప్రదాయంలో శనీశ్వరుడు ఎవరిపైన దయ కురిపిస్తే అతనికి అదృష్టం వరిస్తుంది. అదే సమయంలో ఎవరిపైన వక్ర దృష్టి పడితే రెప్పపాటులో దరిద్రుడు అవుతాడు. శనీశ్వరుడు మనుషుల కర్మలను అనుసరించి కర్మ ఫలాలను ఇచ్చే దేవుడు. హిందూ విశ్వాసం ప్రకారం కర్మల ప్రధాత శనీశ్వరుడు జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ట అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ 19 మే 2023న రేపు జరుపుకోనున్నారు.
అయితే శనీశ్వరుడు ప్రస్తావన వస్తే.. అతని వాహనం అయిన కాకి గురించి ఆలోచిస్తారు. అయితే శనీశ్వరుడు ఒక్క కాకిమీద మాత్రమే కాదు మొత్తం 09 వాహనాలపై ప్రయాణిస్తాడని పురాణాల కథనం. విశేషమేమిటంటే ఈ వాహనాలన్నింటికీ భిన్నమైన హిందూ మతపరమైన ప్రాముఖ్యత ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం, శని అనుగ్రహం కోరుకునే వారు పొరపాటున కూడా ఈ వాహనాలను ఇబ్బంది పెట్టకూడదు.
శనీశ్వరుడుకి సంబంధించిన తొమ్మిది వాహనాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శనీశ్వరుడి స్థానం.. ఆనందానికి , అదృష్టానికి లేదా దుఃఖానికి, దురదృష్టానికి కారణం అవుతుంది. ఏ వ్యక్తి జాతకంలో శనీశ్వరుడు సంచరిస్తాడో ఆ వాహనం, దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో తరచుగా కనిపిస్తుంది. శనీశ్వరుడు వివిధ వాహనాల గురించి.. వాటి వలన లభించే ఫలాల గురించి వివరంగా తెలుసుకుందాం.
- 1. కాకి తరచుగా ఇళ్లలో లేదా చెట్లు, మొక్కలపై కనిపించే పక్షి కాకి. శనీశ్వరుడు అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటి కాకి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని కాకి వాహనం పై ఉన్న సమయంలో సామాన్యుడి జీవితంలో విభేదాలు, బాధలు పెరుగుతాయి.
- 2. గేదె గేదెను శనీశ్వరుడు వాహనంగా పరిగణిస్తారు. శనిదేవుడు గేదెపై స్వారీ చేస్తే.. అప్పుడు ఆ వ్యక్తి సాధారణ ఫలితాలు మాత్రమే పొందుతాడు. ఎందుకంటే గేదె బలంగా ఉండవచ్చు అయితే అది భయపడే జంతువు
- 3. నెమలి హిందూ మతంలో నెమలి అనేక దేవతల వాహనంగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు కూడా నెమలిపై ప్రయాణిస్తాడు. ఇలా శని నెమలిపై ప్రయాణించినప్పుడు, వ్యక్తికి అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుందని.. పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు.
- 4. సింహం శనీశ్వరుడు తొమ్మిది వాహనాల్లో ఒకటి సింహం. శనిదేవుడు సింహంపై స్వారీ చేసే సమయంలో శుభ ఫలితాలను పొందుతాడని.. జీవితానికి సంబంధించిన అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటాడని.. కష్టాలను అధిగమిస్తాడని నమ్ముతారు.
- 5. నక్క నక్కను శనీశ్వరుడు వాహనాల్లో ఒకటిగా పరిగణిస్తారు. శనిదేవుడు నక్కపై స్వారీ చేస్తే వ్యక్తి తన జీవితాన్ని ఇతరులపై ఆధారపడి జీవించవలసి ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో స్థానికులు శుభ ఫలితాలను పొందుతారు.
- 6. ఏనుగు నెమలిలాగే ఏనుగు కూడా అన్ని దేవతలకు వాహనంగా పరిగణించబడుతుంది. శనిదేవుడు కూడా ఏనుగుపై ప్రయాణిస్తాడు. శనిదేవుడు ఈ వాహనంపై ప్రయాణించేటప్పుడు.. వ్యక్తి తన జీవితంలో చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది.
- 7. గుర్రం గుర్రం శని దేవుడి వాహనంగా కూడా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు గుర్రంపై స్వారీ చేస్తున్న సమయంలో వ్యక్తిలో విపరీతమైన శక్తి , ఉత్సాహం ఉంటాయని.. తన లక్ష్యాలన్నింటినీ సులభంగా సాధిస్తాడని నమ్ముతారు.
- 8. గాడిద శనీశ్వరుడు తొమ్మిది వాహనాల్లో గాడిద కూడా ఉంది. శనిదేవుడు గాడిదపై స్వారీ చేస్తే ఒక వ్యక్తి జాతకంలో శుభ ఫలితాలు లేకపోవడానికి కారణమవుతుందని నమ్ముతారు. ప్రతి చిన్న పనికి చాలా కష్టపడాల్సి వస్తుందని విశ్వాసం.
- 9. హంస జ్ఞానానికి దేవత అయిన సరస్వతీ దేవి వాహనం హంస కూడా శనీశ్వరుడు తొమ్మిది వాహనాల్లో ఒకటి అని అంటారు. శనిదేవుడు హంస స్వారీ చేసే సమయంలో ఆ వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయని.. జీవితంలో ఆనందం, అదృష్టం పెరుగుతాయని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).