Lunar Eclipse: రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం.. ఈ మూడు రాశులపై తీవ్ర ప్రభావం.. ఆరోగ్యానికి ఇబ్బందులు..
భారత దేశంలో కనిపించదు అయినప్పటికీ రాశులపై ప్రభావం చూపించనున్నదని జ్యోతిష్యుకులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణ ప్రభావం శుక్రవారం రాత్రి 8.44 గంటల నుంచి అర్థరాత్రి 01.02 వరకు ఉండనుంది.
ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం రేపు ఏర్పడనుంది. వైశాఖ మాసం పూర్ణిమ ను బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. రేపు సాయంత్రం స్వాతి నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు అయినప్పటికీ రాశులపై ప్రభావం చూపించనున్నదని జ్యోతిష్యుకులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణ ప్రభావం శుక్రవారం రాత్రి 8.44 గంటల నుంచి అర్థరాత్రి 01.02 వరకు ఉండనుంది. సైన్ ప్రకారం చంద్రగ్రహణం చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు.. సూర్యుని కాంతి చంద్రుడిపై పడదు.. అప్పుడు చంద్రుడు కనిపించడు.
అయితే హిందూ సనాతన ధర్మంలో చంద్రుడిని రాహువు, కేతువు మింగడానికి ప్రయత్నిస్తాడు అని నమ్మకం. దానిని చంద్రగ్రహణం అని అంటారు. ఈ క్రమంలో పలు రాశులవారిపై చంద్ర గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణ ప్రభావం ఏఏ రాశులవారిపై ఉందనున్నదో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారిపై చంద్రగ్రహణం అధికంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మానసికంగా తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు. కనుక దంపతులు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు.. కనుక రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశివారిపై తీవ్రంగా ఉండనుంది. ఈ రాశివారు తప్పనిసరిగా ఆరోగ్యం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఇబ్బందులు తలెత్తవచ్చు.
చంద్రుడు బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు: చంద్ర గ్రహణ సమయంలో జాతకంలో చంద్రుడి స్థానాన్ని బలోపేతం చేయడానికి చంద్రుని బీజ మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అయితే ఈ మంత్రాలు జపించే ముందు తులసి ఆకులను తీసుకోవడం వలన ఈ మంత్రాలు అత్యంత ఫలవంతం అవుతాయని జోతిష్కులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).