Zodiac Signs: రెండు గ్రహాల మేలు కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగపరంగా శుభఫలితాలు పక్కా..!

మొత్తానికి ఉద్యోగంలో స్థిరత్వానికి ఈ రెండు గ్రహాలు (బుధ, గురు) కలయికే చాలావరకు కారణం అని చెప్ప వచ్చు. ప్రస్తుతం ఎనిమిది రాశుల వారికి ఉద్యోగ పరంగా శుభ సూచనలు, శుభపరిణామాలు కనిపిస్తున్నాయి.

Zodiac Signs: రెండు గ్రహాల మేలు కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగపరంగా శుభఫలితాలు పక్కా..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 04, 2023 | 5:34 PM

ప్రస్తుతం మేష రాశిలో గురు, బుధ గ్రహాలు కలసి సంచరిస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు కలవడం అనేది సాధారణంగా ఉద్యోగంలో స్థిరత్వానికి దోహదం చేస్తుంది. ప్రతిభా పాటవాలకు కారకుడైన గురుగ్రహం, బుద్ధి, విద్య కారకుడైన బుధ గ్రహం కలవడం ఒక గొప్ప విశేషం. ఈ రెండు గ్రహాలు కలిసిన సమయంలో ఉద్యోగంలో చేరేవారు తప్పకుండా ఆ ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి సానుకూల మార్పు చోటు చేసుకున్నప్పటికీ అది కలకాలం కొనసాగుతుంది. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఉద్యోగానికి సంబంధిం చిన ఆఫర్లు రావడం ఈ రెండు గ్రహాల కలయిక కారణంగానే జరుగుతుంటుంది. మొత్తానికి ఉద్యోగంలో స్థిరత్వానికి ఈ రెండు గ్రహాల కలయికే చాలావరకు కారణం అని చెప్ప వచ్చు. ప్రస్తుతం ఎనిమిది రాశుల వారికి ఉద్యోగ పరంగా శుభ సూచనలు, శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. ఆ రాశులు మేషం, మిధునం, కర్కాటకం, సింహం, తుల, ధనస్సు, మకరం, మీనం.

మేష రాశి: మేష రాశి లోనే గురు, బుధ గ్రహాల కలయిక జరుగుతున్నందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా ఉద్యోగంలో స్థిరత్వం తో పాటు సానుకూల మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ పరంగా అనూహ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు చెవిన పడే అవకాశం ఉంది. ప్రస్తుత అనుకూల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.

మిథున రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో గురు బుధ గ్రహాలు కలవడం వల్ల ఉద్యోగ పరంగా ఏ ప్రయత్నం చేసినా, ఏ మార్పు తలపెట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది. మంచి ప్రమోషన్ లేదా భారీ ఇంక్రిమెంట్ తో పాటు ఉద్యోగంలో తిరుగులేని పర్మనెంట్ స్థానం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో మార్పు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు తక్కువ ప్రయత్నంతో మంచి ఉద్యోగం చేజిక్కించుకోవటం ఖాయంగా జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి సమయం పూర్తిగా అనుకూలంగా ఉంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశి వారికి దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలోనే గురు, బుధ గ్రహాలు కలవడం వల్ల ఉద్యోగ పరంగా శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా దూరప్రాంతం నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయి జీత భత్యాలతో ఉద్యోగంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా అధికార యోగానికి అదృష్టానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యో గులు మంచి ఆఫర్లు అందుకోవడం జరుగు తుంది. ఏదైనా సంస్థలో ఇప్పుడు ఉద్యోగం పొందిన వారు ఆ ఉద్యోగంలో అనేక సంవత్సరాల పాటు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఈ రెండు శుభగ్రహాలు కలవడంతోపాటు రాశి నాథుడు అయిన రవి కూడా కలవడం వల్ల ఉద్యోగ పరంగా అనివార్యంగా స్థిరత్వం లభించడంతో పాటు హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. అది ఏ ఉద్యోగం అయినప్పటికీ అధికార యోగానికి కూడా అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా జీతభత్యాలు కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరగటం జరుగుతుంది. మంచి ప్రమోషన్కు అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఈ చిన్న ప్రయత్నం చేసినా శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి.

తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతున్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో చాలాకాలంగా ఎదురు చూస్తున్నా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఇది వరకు వ్యతిరేకంగా ఉన్న అధికారులు, యజమానులు ఇప్పుడు పూర్తిగా సానుకూలం అవుతారు. ఉద్యోగ స్థానంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు ఉద్యోగాన్ని వదిలి పెట్టాలనుకున్నప్పటికీ ఆ ఉద్యోగం మిమ్మల్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సామాజిక హోదా కూడా పెరుగుతుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి పంచమ స్థానం అయిన మేష రాశిలో గురు, బుధ గ్రహాల కాంబినేషన్ చోటు చేసుకోవడం ఒక విధంగా అదృష్టం అనే చెప్పాలి. ఇందులో గురుగ్రహం ఈ రాశి నాధుడే అయినందువల్ల ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా విశేష ఫలితాలు అనుభవానికి వస్తాయి. వీరికి వివిధ సంస్థల నుంచి అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగుల ప్రయత్నాలు అతివేగంగా శుభ ఫలితాలను ఇస్తాయి. వృత్తిపరంగా కూడా ఈ రాశి వారికి ఇది శుభ సమయం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.

మకర రాశి: ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో ఈ రెండు శుభగ్రహాల కలయిక జరుగుతున్నందువలన తప్పకుండా ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి, ప్రత్యేక బాధ్యతను స్వీకరించడానికి, అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభించడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అధికారులు లేదా యజమానులు ఈ రాశి వారి మీద ఎక్కువగా ఆధారపడటం వీరి సలహాలకు సూచనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించడం ఖాయం అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఉద్యోగపరంగా సమయం అనుకూలంగా ఉంది.

మీన రాశి: ఈ రాశి వారికి ధనస్థానంలో ఈ రెండు శుభ గ్రహాలు చేరటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం, సానుకూల మార్పులు, అధికారం, ప్రమోషన్ వగైరాలతో పాటు ఆదాయం కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ స్థానంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వాహన సౌకర్యం కూడా ఏర్పడు తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి పరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది.