Zodiac Signs: మేష రాశిలో నాలుగు గ్రహాల మేలు కలయిక.. ఆ నాలుగు రాశులకు అసాధారణ ఫలితాలు..
మేషరాశిలో నాలుగు గ్రహాల మేలు కలయిక చోటు చేసుకుంది. గురువు, రాహువు, బుధుడు, రవి మేషరాశిలో కలవగా వృషభ రాశిలో శుక్రుడు స్వస్థానంలో సంచరించడం ఒక అరుదైన గ్రహ సంచారంగా భావించవచ్చు. మేషరాశిలో గురువు, బుధుడు, రవి గ్రహాలకు విపరీతమైన బలం పట్టడం..
Telugu Astrology: మేషరాశిలో నాలుగు గ్రహాల మేలు కలయిక చోటు చేసుకుంది. గురువు, రాహువు, బుధుడు, రవి మేషరాశిలో కలవగా వృషభ రాశిలో శుక్రుడు స్వస్థానంలో సంచరించడం ఒక అరుదైన గ్రహ సంచారంగా భావించవచ్చు. మేషరాశిలో గురువు, బుధుడు, రవి గ్రహాలకు విపరీతమైన బలం పట్టడం, వీటితో కలసిన పాపగ్రహం అయిన రాహువు కు బలం క్షీణించడం వల్ల కొన్ని రాశుల వారికి మే 15 వరకు జీవితంలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. గురు చండాల యోగం తాలూకు దోషం చాలావరకు తగ్గిపోయి, బుధాదిత్య యోగం తాలూకు శుభ ఫలితాలు పెరగటం జరుగుతుంది. ఈ మార్పులు, చేర్పుల వల్ల మేషం ం, కర్కాటకం, తుల, మకర రాశి వారి జీవితాలలో పెను మార్పులకు అవకాశం ఉంది.
- మేష రాశి: ఈ రాశిలో రవి, గురు, బుధ, రాహువులు కలవడం, ద్వితీయ స్థానంలో శుక్ర గ్రహం ఉండటం వల్ల వీరి జీవితంలో ఈ నెల రోజుల కాలంలో కొన్ని అసాధారణ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకోవడం జరుగుతుంది. సాధారణంగా అతి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి సైతం వెలుగులోకి రావడం, మంచి గుర్తింపు పొందడం, అందలాలు ఎక్కడం, రాజయోగం పట్టడం, సన్మానాలు, సత్కారాలు జరగటం వంటివి అనుభవానికి వస్తాయి. గత 23వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీలోగా జీవితంలో చిత్ర విచిత్రంగా సానుకూలంగా శుభకరంగా మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం, ఆదాయం, వృత్తి, వ్యాపారం, విదేశీ యానం, స్థిరత్వం, సంతానం, వివాహం వంటి విషయాలలో తప్ప కుండా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ఇవన్నీ గానీ, ఇందులో కొన్ని గానీ సంభవించే అవకాశం ఉంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం నాలుగు శుభగ్రహాలు పది, పదకొండు స్థానాలలో సంచరించడం జరుగుతోంది. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రెండు స్థానాలకు విపరీతమైన బలం చేకూరింది. దీని ఫలితంగా ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలలో అనూహ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి విదేశాలలో స్థిరపడే అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో తిరుగులేని పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు తప్పకుండా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవడం జరుగు తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారి సలహాలు సూచన లతో అధికారులు లేదా యాజమాన్యాలు ప్రయో జనం పొందటం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మాట చెల్లుబాటు అవుతుంది. వితరణ గుణం పెరుగుతుంది.
- తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహాల కలయిక జరిగినందువల్ల వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా కొన్ని అసాధారణ అనూహ్య శుభ పరిణామాలు తప్పనిసరిగా అనుభవానికి వస్తాయి. చాలాకాలంగా మానసికంగా ఆందోళన కలిగిస్తున్న కొన్ని వ్యక్తిగత సమస్యలు విచిత్రంగా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా కుటుంబ సమస్యలు కూడా అప్రయత్నంగా పరిష్కార మయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యాలు జరగటానికి అవకాశం ఉంది. శుభ వార్తలు వింటారు. దాంపత్య జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా సాగిపోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి నిశ్చయం అయిపోతుంది. సంతానం లేని వారు సంతానానికి సంబంధించి శుభవార్త వినడం జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
- మకర రాశి: ఈ రాశి వారికి నాలుగు ఐదు స్థానాలలో శుభగ్రహాల సంచారం వల్ల కొన్ని రకాల అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి. కొన్ని అసాధారణ శుభ ఫలితాలు, శుభపరిణామాలు చోటు చేసు కోవడం జరుగుతుంది. ఎంతో కాలంగా కలలు గంటున్న గృహ, వాహన సౌకర్యాలు అమరటం జరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పెద్దల నుంచి ఆస్తి కలసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆస్తికి సంబంధించిన కోర్టు వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. ఈ రాశి వారు ఇకనుంచి ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత శుభం జరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన మార్పు జరిగి అధికారం చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..